ఐదు వికెట్లతో చెలరేగిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 294 ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 328

India Vs Australia 2020: బ్రిస్బేన్‌ వేదికగా టీమిండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పోరు ముగిసింది. 75.5 ఓవర్లకు..

  • Ravi Kiran
  • Publish Date - 12:01 pm, Mon, 18 January 21
ఐదు వికెట్లతో చెలరేగిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 294 ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 328

India Vs Australia 2020: బ్రిస్బేన్‌ వేదికగా టీమిండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పోరు ముగిసింది. 75.5 ఓవర్లకు ఆసీస్ 294 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్(57) అర్ధ సెంచరీతో అదరగొట్టగా.. వార్నర్(48), గ్రీన్(37), హారిస్(38) రాణించడంతో ఆతిధ్య జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. దీనితో టీమిండియా ముందు 328 భారీ లక్ష్యాన్ని విధించింది. ఇక భారత బౌలర్లలో సిరాజ్ 5 వికెట్లు పడగొట్టగా.. ఠాకూర్ 4 వికెట్లు, సుందర్ ఒక వికెట్ తీశారు.