India Vs Australia 2020: ముగిసిన నాలుగో రోజు ఆట.. గెలవాలంటే భారత్‌కు 324.. ఆసీస్‌కు 10 వికెట్లు..

India Vs Australia 2020: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి...

India Vs Australia 2020: ముగిసిన నాలుగో రోజు ఆట.. గెలవాలంటే భారత్‌కు 324.. ఆసీస్‌కు 10 వికెట్లు..
India Vs Australia 2020
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 18, 2021 | 1:02 PM

India Vs Australia 2020: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. గబ్బాలో మళ్లీ వర్షం కురవడం మొదలు కావడంతో అంపైర్లు నిర్ణీత సమయానికి ముందే ఆటను ముగించారు.

ప్రస్తుతం రోహిత్ శర్మ(4), గిల్(0) క్రీజులో ఉన్నారు. ఐదో రోజు గంట ముందుగానే ప్రారంభం కానుండగా.. గెలవాలంటే భారత్‌ 324 పరుగులు చేయాల్సి ఉండగా, ఆసీస్‌ 10 వికెట్లు పడగొట్టాలి. అంతకముందు 21/0 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 75.5 ఓవర్లకు ఆసీస్ 294 పరుగులకు ఆలౌట్ అయింది.

స్టీవ్ స్మిత్(57) అర్ధ సెంచరీతో అదరగొట్టగా.. వార్నర్(48), గ్రీన్(37), హారిస్(38) రాణించడంతో ఆతిధ్య జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. దీనితో టీమిండియా ముందు 328 భారీ లక్ష్యాన్ని విధించింది. ఇక భారత బౌలర్లలో సిరాజ్ 5 వికెట్లు పడగొట్టగా.. ఠాకూర్ 4 వికెట్లు, సుందర్ ఒక వికెట్ తీశారు.