Hanuma Vihari Meets KTR: మంత్రి కేటీఆర్‌ను కలిసిన సిడ్నీటెస్టు హీరో తెలుగు తేజం హనుమ విహారి
తెలుగు తేజం.. సిడ్నీ టెస్ట్ హీరో యంగ్ క్రికెటర్ హనుమ విహారీ తెలంగాణ మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా హనుమ విహారీని మంత్రి శాలువాతో సన్మానించారు...
Hanuma Vihari Meets KTR: తెలుగు తేజం.. సిడ్నీ టెస్ట్ హీరో యంగ్ క్రికెటర్ హనుమ విహారీ తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా హనుమ విహారీని మంత్రి శాలువాతో సన్మానించారు. భారత్, ఆసీస్ ల మధ్య సిడ్నీ లో జరిగిన మూడో టెస్ట్ డ్రాగా ముగియడానికి హనుమ చేసిన పోరాటాన్ని మంత్రి అభినందించారు. ఆసీస్ పర్యటనకు సంబంధించిన విశేషాలను మంత్రికి వివరించాడు హనుమ. కేటీఆర్ ను కలిసిన విషయాన్నీ ఆయన తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో రవిచంద్రన్ అశ్విన్ తో కలిసి విహారి కీ రోల్ పోషించాడు. తొడకండరం పట్టేయడంతో నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. ఇటీవలే స్వదేశం చేరుకున్న హనుమ మంత్రి కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశాడు.
Also Read: 2020 భిన్నమైన సంవత్సరం..జీవితంలో విశ్రాంతి తీసుకొని.. మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడింది