Breaking: భారత హాకీ లెజండ్, ఒలింపిక్ విన్నర్ బల్పీర్ సింగ్ కన్నమూత..!
భారత హాకీ లెజండ్, ఒలింపిక్ గోల్డ్ మెడల్ గ్రహీత బల్బీర్ సింగ్(96) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు.

భారత హాకీ లెజండ్, ఒలింపిక్ గోల్డ్ మెడల్ గ్రహీత బల్బీర్ సింగ్(96) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని మొహాలీలోని ఫోర్టీస్ ఆసుపత్రి డైరెక్టర్ అబిజిత్ సింగ్ వెల్లడించారు. ఈ నెల 8న తమ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన బల్బీర్.. చికిత్స పొందుతూ ఈ ఉదయం గం.6.30ల సమయంలో కన్నుమూసినట్లు అబిజిత్ తెలిపారు. బల్బీర్‌కి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు.
కాగా హాకీలో లెజండ్ అయిన బల్బీర్ సింగ్.. ఒలింపిక్‌లో ఏకంగా మూడు స్వర్ణ పతకాలు సాధించారు. 1948, 52, 56లో భారత హాకీ టీమ్ ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించగా.. ఆ మూడింటిలో ఆయన ఉండటం గమనర్హం. ఈ క్రమంలో ఒలింపిక్ చరిత్రలో పురుషుల హాకీ ఫైనల్‌లో ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాడిగా కూడా బల్బీర్ సింగ్ ఉన్నారు. ఇప్పటికీ ఆయన రికార్డులు ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోవడం విశేషం. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎంపిక చేసిన 16 మంది లెజండ్ల లిస్ట్‌లో భారత్ నుంచి ఒల్బీర్ ఒక్కరు మాత్రమే ఉండటం విశేషం. కాగా ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక 2015లో హాకీ ఇండియా మేజర్ ధ్యాన్‌చంద్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును బల్బీర్‌కి ప్రధానం చేసింది. మరోవైపు ఆయన మరణంపై అటు క్రీడా ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని వారు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
Read This Story Also: Bigg Boss 4: ‘బిగ్‌బాస్’ నిర్వాహకులు, ఫ్యాన్స్‌కి షాక్..!