‘నీ టిక్ టాక్ వీడియోలు కంటే..’ పీటర్సన్‌ను ట్రోల్ చేసిన కోహ్లీ..
కరోనా వైరస్ కారణంగా క్రీడా టోర్నమెంట్లన్నీ రద్దు కావడంతో ఆటగాళ్లందరూ గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. కొంతమంది టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటే.. మరికొందరు ఇన్‌స్టా లైవ్ ద్వారా అబిమానులకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య చిన్న కామెడీ సంభాషణ జరిగింది. గతంలో తీసుకున్న ఓ ఫోటోను విరాట్ ఆదివారం తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. అది చూసి పీటర్సన్.. […]

కరోనా వైరస్ కారణంగా క్రీడా టోర్నమెంట్లన్నీ రద్దు కావడంతో ఆటగాళ్లందరూ గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. కొంతమంది టిక్ టాక్‌లో వీడియోలు చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటే.. మరికొందరు ఇన్‌స్టా లైవ్ ద్వారా అబిమానులకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య చిన్న కామెడీ సంభాషణ జరిగింది.
గతంలో తీసుకున్న ఓ ఫోటోను విరాట్ ఆదివారం తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. అది చూసి పీటర్సన్.. ‘నీ గడ్డం తీసుకో’ అని కామెంట్ చేశాడు. దానికి కోహ్లీ ‘నీ టిక్ టాక్ వీడియోలు కంటే మెరుగ్గానే ఉందంటూ’ చురకలు అంటించాడు. కాగా, పీటర్సన్, డేవిడ్ వార్నర్‌లు తాజాగా టిక్ టాక్ వీడియోలతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.