జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదుల హతం

ఓ వైపు కొవిడ్‌తో ప్రపంచమంతా అల్లాడుతుంటే.. మరోవైపు పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కర మూకలు మాత్రం బరితెగిస్తున్నారు. అయితే వారి దుశ్చర్యలను పసిగట్టిన ఇండియన్‌ ఆర్మీ..

జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదుల హతం

ఓ వైపు కొవిడ్‌తో ప్రపంచమంతా అల్లాడుతుంటే.. మరోవైపు పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కర మూకలు మాత్రం బరితెగిస్తున్నారు. అయితే వారి దుశ్చర్యలను పసిగట్టిన ఇండియన్‌ ఆర్మీ.. వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవలే హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు చెందిన ఇద్దరు కిరాతకులను హతమార్చిన భారత సైన్యం.. తాజాగా జమ్ముకశ్మీర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

కుల్గాం హింజిపొరలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించాయి భద్రతా దళాలు. లొంగిపోయేందుకు నిరాకరించిన వారు కాల్పులకు తెగబడ్డారు. భారత సైన్యం ఎదురుకాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు అక్కడికక్కడే హతమయ్యారు. ఇంకా ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న అనుమానంతో.. ఆపరేషన్‌ కొనసాగుతోంది.