‘పేద్ద’ పాముకు ‘స్నానం’.. అతడికెంత ధైర్యం ?

ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యమది ! చూస్తుంటేనే ఆశ్చర్యంతో నోట మాట రాక స్తంభించిపోయేట్టు చేసే సీన్ అది ! సుమారు 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాకు ఎంచక్కా 'స్నానం' చేయిస్తున్నాడా వ్యక్తి..

  • Updated On - 3:44 pm, Mon, 25 May 20 Edited By: Pardhasaradhi Peri
'పేద్ద' పాముకు 'స్నానం'.. అతడికెంత ధైర్యం ?

ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యమది ! చూస్తుంటేనే ఆశ్చర్యంతో నోట మాట రాక స్తంభించిపోయేట్టు చేసే సీన్ అది ! సుమారు 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాకు ఎంచక్కా ‘స్నానం’ చేయిస్తున్నాడా వ్యక్తి.. అత్యంత విషపూరితమైన ఆ పాము కూడా ఎలాంటి ‘మారాం’ చేయకుండా.. బుసలు కూడా కొట్టకుండా ఇష్టంగా తనపై  నీళ్లు పోయించుకుంది. ఆ వ్యక్తి మీదికి ఏమాత్రం ఎగబడకుండా అతగాడు బకెట్ తో తల మీద నీళ్లు గుమ్మరిస్తుంటే ‘తలంటి’ పోయించుకోవడం విశేషం. అటవీ అధికారి సుశాంత్ నందా ఈ  వీడియోను షేర్ చేశారు. బడాబడా  పాములను కూడా హాండిల్ చేయడంలో నేర్పరి అయిన ఆ వ్యక్తి పేరు వావా సురేష్ అట ! స్నేక్ ఎక్స్ పర్ట్ అయిన ఇతడి ఈ వింత ‘స్టంట్’ చూసి ట్విటర్ యూజర్లంతా తలోరకంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు అతని సాహసాన్ని పొగిడితే.. మరికొందరు ఇదంతా ‘ట్రాష్’.. ఆ పాము అతని పెంపుడు పామై ఉంటుంది అని కొట్టిపారేస్తున్నారు.