AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదే పనిగా ఇయర్ ఫోన్స్ వాడేవారు.. మీ చెవులు కాస్త జాగ్రత్త..!

మొబైల్ ప్రపంచం వచ్చాక.. జనం బయటి లోకాన్నే మర్చిపోతున్నారు. అదేనిగా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నచ్చనవారితో కబుర్లు, నచ్చిన సంగీతాన్ని అస్వాదిస్తుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్ద‌వాళ్ల వ‌ర‌కు అంద‌రికీ ఇయర్ ఫోన్స్ శ‌రీరంలో ఒక భాగంగా మారిపోయాయి. అంతా ఇయర్ ఫోన్స్ తో కనెక్ట్ అయ్యారు. కానీ, ఇయ‌ర్ ఫోన్స్ ఎక్కువ సేపు చెవిలో పెట్టుకోకూడ‌ద‌న్న‌ది నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని అధికంగా వాడ‌టం వ‌ల్ల వినికిడి స‌మ‌స్యలు తలెత్తే అవ‌కాశం ఉందంటున్నారు. ఇక వైర్‌లెస్ […]

అదే పనిగా ఇయర్ ఫోన్స్ వాడేవారు.. మీ చెవులు కాస్త జాగ్రత్త..!
Balaraju Goud
|

Updated on: May 25, 2020 | 3:58 PM

Share

మొబైల్ ప్రపంచం వచ్చాక.. జనం బయటి లోకాన్నే మర్చిపోతున్నారు. అదేనిగా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నచ్చనవారితో కబుర్లు, నచ్చిన సంగీతాన్ని అస్వాదిస్తుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్ద‌వాళ్ల వ‌ర‌కు అంద‌రికీ ఇయర్ ఫోన్స్ శ‌రీరంలో ఒక భాగంగా మారిపోయాయి. అంతా ఇయర్ ఫోన్స్ తో కనెక్ట్ అయ్యారు. కానీ, ఇయ‌ర్ ఫోన్స్ ఎక్కువ సేపు చెవిలో పెట్టుకోకూడ‌ద‌న్న‌ది నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని అధికంగా వాడ‌టం వ‌ల్ల వినికిడి స‌మ‌స్యలు తలెత్తే అవ‌కాశం ఉందంటున్నారు. ఇక వైర్‌లెస్ ఇయ‌ర్ ఫోన్స్ వ‌ల్ల రేడియేష‌న్‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉందంటున్నారు వైద్యనిపుణులు. ఇవేవి పట్టని చైనా బాలుడ్ని ఆస్పత్రిపాలు చేశాయి ఇయర్ ఫోన్స్. ఇయ‌ర్ ఫోన్స్ ఎక్కువ‌గా వాడినందుకు ఓ బాలుడు ఆస్ప‌త్రిపాలయ్యాడు. బీజింగ్‌కు చెందిన ప‌దేళ్ల బాలుడు చెవిలో నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో అత‌ను ఆస్ప‌త్రికి వెళ్ల‌గా, అత‌డిని ప‌రీక్షించిన వైద్యులు షాక్‌కు గుర‌య్యారు. చెవిలో ద‌ట్టంగా పెద్ద స‌మూహంలో శిలీంధ్రాలు పెరుగుతున్న‌ట్లు గుర్తించారు. దీన్ని ‘బ్లాక్ ఫారెస్ట్ ఆఫ్ ఫంగ‌స్’‌గా తెలిపారు. సుదీర్ఘంగా అందిస్తున్న చికిత్స వ‌ల్ల‌ ప్ర‌స్తుతం అత‌డు పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌పడ్డాడ‌ని తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను డా.వు యుహువా సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఇయ‌ర్ ఫోన్స్ విచ్చ‌ల‌విడిగా వాడ‌టం వ‌ల్లే ఇంత ఘోరం జ‌రిగింద‌ని చెప్పుకొచ్చాడు. వైర్‌లెస్ ఇయ‌ర్‌ఫోన్స్‌, హెడ్‌ఫోన్స్ వాడకందారులు.. దాని ప‌ర్య‌వ‌సానాల‌ను తెలుసుకుని ప‌రిమితంగా వినియోగించాల‌ని హెచ్చ‌రిస్తున్నారు నిపుణులు. ఇయ‌ర్‌ ఫోన్స్ వినియోగ‌దారులు చెవులను ఎప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు ఇయర్ ఫోన్స్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిదంటున్నారు.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..