AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కట్నం కోసం కాలనాగుతో భార్యను చంపిన భర్త

కట్టుకున్నవాడే కాలయముడైయ్యాడు. పెళ్లై ఓ బాబు పుట్టిన కట్నం డబ్బులపై మోజు తగ్గలేదు. అత్తారింటి నుంచి కాసులు రావని తెలిసి భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా పాముకాటుతో చంపించాడు. ఒకే నెలలో రెండు సార్లు పాము కాటు వేయడంతో అనుమానం వచ్చి యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. కొల్లం జిల్లాలోని అంచల్ కు చెందిన సూరజ్, ఉత్రా భార్యభర్తలు. వీరికి వివాహమై రెండేళ్లయింది. వీరికి సంవత్సరం వయసున్న కొడుకు ఉన్నాడు. సూరజ్ […]

కట్నం కోసం కాలనాగుతో భార్యను చంపిన భర్త
Balaraju Goud
|

Updated on: May 25, 2020 | 5:19 PM

Share

కట్టుకున్నవాడే కాలయముడైయ్యాడు. పెళ్లై ఓ బాబు పుట్టిన కట్నం డబ్బులపై మోజు తగ్గలేదు. అత్తారింటి నుంచి కాసులు రావని తెలిసి భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా పాముకాటుతో చంపించాడు. ఒకే నెలలో రెండు సార్లు పాము కాటు వేయడంతో అనుమానం వచ్చి యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. కొల్లం జిల్లాలోని అంచల్ కు చెందిన సూరజ్, ఉత్రా భార్యభర్తలు. వీరికి వివాహమై రెండేళ్లయింది. వీరికి సంవత్సరం వయసున్న కొడుకు ఉన్నాడు. సూరజ్ ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్నంతలో వీరి కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఉన్నట్లుండి సూరజ్ కు మరింత కట్నంపై మోజు పడింది. దీంతో కట్నం కోసం ఉత్రాను కొన్ని నెలలుగా వేధించడం మొదలుపెట్టాడు. కానీ, ఆమె కుటుంబం నుంచి ఎటువంటి కట్నం వచ్చే అవకాశంలేదని గ్రహించిన సూరజ్.. ఉత్రాను అంతమొందించాలని డిసైడయ్యాడు. తన చేతులకు మట్టి అంటకుండా వదిలిచ్చుకోవాలనుకున్నాడు. ఇందుకోసం పక్కా ఫ్లాన్ రెడీ చేసుకున్నాడు. తనకు తెలిసిన సురేష్ అనే పాములు పట్టే వ్యక్తికి రూ.పది వేలు చెల్లించి ఒక పామును కొన్నాడు. మార్చి నెలలో భార్య గదిలో నిద్రపోతుండగా.. పామును ఉత్రాపైకి వదిలాడు సూరజ్. పాము కాటు గమనించిన ఉత్రా వెంటనే తేరుకొని బంధువుల సాయంతో ఆస్పత్రికి చేరుకుంది. అక్కడ కొన్ని రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఉత్రా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత మే7న సూరజ్.. ఉత్రా దగ్గరకు వెళ్లాడు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత సూరజ్.. ఒక కోబ్రాను ఉత్రా మీదికి వదిలాడు. అది ఉత్రాను కాటేయడంతో ఆమె నిద్రలోనే చనిపోయింది. ఈ విషయం తెలియక ఉత్రా తల్లిదండ్రులు అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఉత్రా పాముకాటుతో చనిపోయినట్టు నిర్ధారించారు వైద్యులు. అక్కడే ఉన్న సూరజ్ తనకేమీ తెలియదన్నట్లుగా గదిలో ఉన్న పామును కర్రతో కొట్టి చంపాడు. అయితే ఉత్రాకు రెండోసారి కూడా పాము కరవడంతో ఆమె తల్లిదండ్రులకు వారం తర్వాత అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సూరజ్ విచారించారు. దీంతో  అసలు విషయం బయటపడింది. సూరజ్ కట్నం కోసం ఈ హత్య చేశానని పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడు. ఉత్రాను చంపడానికి ఐదు నెలలుగా స్కెచ్ వేసినట్లు వివరించాడు. సూరజ్ కు సహకరించిన సురేష్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Follow Us
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పల్లీలు అటుకుల లడ్డు..
పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పల్లీలు అటుకుల లడ్డు..