వరల్డ్ అప్డేట్: కరోనా పాజిటివ్ కేసులు @ 55 లక్షలు..

ప్రపంచదేశాలలో కరోనా వైరస్ మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. దీనికి అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతూనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 5,517,708 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 346,964 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 2,310,480 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ప్రపంచంలో మరణాల రేటు కంటే […]

  • Updated On - 3:54 pm, Mon, 25 May 20 Edited By: Pardhasaradhi Peri
వరల్డ్ అప్డేట్: కరోనా పాజిటివ్ కేసులు @ 55 లక్షలు..

ప్రపంచదేశాలలో కరోనా వైరస్ మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. దీనికి అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతూనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 5,517,708 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 346,964 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 2,310,480 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ప్రపంచంలో మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటం కొంచెం ఊరట కలిగించే అంశం అని చేప్పాలి.

అమెరికా, బ్రెజిల్, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యా దేశాల్లో కరోనా ఉద్దృత్తి తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(1,686,436), మరణాలు(99,300) సంభవించాయి. అటు బ్రెజిల్ లో పాజిటివ్ కేసులు 365,213 నమోదు కాగా, మృతుల సంఖ్య 22,746కు చేరింది. ఇక  రష్యాలో 353,427 పాజిటివ్ కేసులు,  3,633 మరణాలు నమోదయ్యాయి. కాగా, భారత్‌లో కరోనా కేసులు 139,911 నమోదు కాగా, మృతుల సంఖ్య 4,039కి చేరింది.