Rohit Sharma: ఆరెంజ్ క్యాప్ రేసులోకి వచ్చిన హిట్ మ్యాన్ రోహిత్.. ఐపీఎల్ టాప్ బ్యాట్స్ మెన్లు ఎవరంటే!

ఐపీఎల్ టోర్నీలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురుస్తోంది. ఈ సీజన్ లో బౌలర్లను పూర్తిగా ఉతికి ఆరేసే అవకాశం కేవలం బ్యాట్స్‌మెన్స్ కు వచ్చింది. దీంతో మొదటి రోజు నుంచే పరుగుల వరద పారింది. అయితే ఒక్కోసారి ఎవరైనా టాప్ పొజిషన్ లో ఉంటే, మరోసారి టాప్ 5 లోంచి ప్లేస్ గల్లంతయ్యే పరిస్థితి కూడా ఉంది.

Rohit Sharma: ఆరెంజ్ క్యాప్ రేసులోకి వచ్చిన హిట్ మ్యాన్ రోహిత్.. ఐపీఎల్ టాప్ బ్యాట్స్ మెన్లు ఎవరంటే!
Rohit Sharma
Follow us
Balu Jajala

|

Updated on: Apr 15, 2024 | 10:26 AM

ఐపీఎల్ టోర్నీలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురుస్తోంది. ఈ సీజన్ లో బౌలర్లను పూర్తిగా ఉతికి ఆరేసే అవకాశం కేవలం బ్యాట్స్‌మెన్స్ కు వచ్చింది. దీంతో మొదటి రోజు నుంచే పరుగుల వరద పారింది. అయితే ఒక్కోసారి ఎవరైనా టాప్ పొజిషన్ లో ఉంటే, మరోసారి టాప్ 5 లోంచి ప్లేస్ గల్లంతయ్యే పరిస్థితి కూడా ఉంది. అయితే గత కొన్ని మ్యాచ్‌ల్లో రెచ్చిపోతూ ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు రన్‌మెషీన్స్ విరాట్ కోహ్లీ. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఎన్ని పరుగులు చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. మరిన్ని పరుగులు చేస్తే అందరికంటే అందనంత ఎత్తులో ఉండే అవకాశం ఉండగా, ఒకవేళ కొద్ది పరుగులకే ఔట్ అయితే ఆరెంజ్ క్యాప్ ను దూరం చేసుకునే పరిస్థితి కూడా ఉంది.

విరాట్ కోహ్లీ ఆరు మ్యాచ్‌ల్లో 319 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ ఇన్నింగ్స్ 113 నాటౌట్. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన రియాన్ పరాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో 284 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 264 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ రేసులో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 255 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ సాధించి ఐదో స్థానానికి ఎగబాకాడు. రోహిత్ శర్మ మొత్తం 243 పరుగులు. మరోవైపు, శివమ్ దూబే అద్భుతంగా ఆడాడు. అతను అజేయంగా 66 పరుగులు చేశాడు. దీంతో 242 పరుగులతో ఆరో స్థానానికి ఎగబాకాడు.

కాగా, చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి విజయానికి 207 పరుగుల సవాలు విసిరింది. అయితే ముంబై ఇండియన్స్ చివర్లో చతికిలపడిపోయింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగలిగింది. కానీ విజయానికి 20 పరుగుల దూరంలో ఓడిపోయింది. అయితే వచ్చే మ్యాచుల్లో రోహిత్ రెచ్చిపోతే ఆరెంజ్ క్యాప్ దక్కించుకోవడం కష్టమేమి కాదు.

మరిన్ని ఐపీఎల్ క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి