MS Dhoni: దంచికొట్టిన ధోనీ.. 3 బంతుల్లో 3 సిక్సులు బాదిన ఫినిషింగ్ మాస్టర్, పాపం హార్థిక్
ఐపీఎల్ 17వ సీజన్ లో మహేంద్ర సింగ్ ధోని తన బ్యాటింగ్ తో దుమ్మురేపుతున్నాడు. అభిమానులకు మరిచిపోలేని ఇన్సింగ్స్ ను అందిస్తున్నాడు. అయితే చెన్నై తొలి 5 మ్యాచ్‌ల్లో ధోని స్టైల్‌ను అభిమానులు చూడలేకపోయారు. కానీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ తన అభిమానుల నిరీక్షణను ముగించాడు.
ఐపీఎల్ 17వ సీజన్ లో మహేంద్ర సింగ్ ధోని తన బ్యాటింగ్ తో దుమ్మురేపుతున్నాడు. అభిమానులకు మరిచిపోలేని ఇన్సింగ్స్ ను అందిస్తున్నాడు. అయితే చెన్నై తొలి 5 మ్యాచ్‌ల్లో ధోని స్టైల్‌ను అభిమానులు చూడలేకపోయారు. కానీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ తన అభిమానుల నిరీక్షణను ముగించాడు. తనను ఫినిషింగ్ మాస్టర్ అని ఎందుకు పిలుస్తాడో మళ్లీ నిరూపించాడు. ఇన్నింగ్స్ 20వ ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మొత్తం 4 బంతుల్లో 3 వరుస సిక్సర్లతో ధోనీ 20 పరుగులు చేశాడు. ధోని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దీంతో చెన్నై 7.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానే 5, రచిన్ రవీంద్ర 21 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో చెన్నై 2 వికెట్లకు 60 పరుగులు చేసింది. ఆ తర్వాత శివమ్ దూబే, కెప్టెన్ రీతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ టాప్ గేర్ వేసి ఇన్నింగ్స్‌ను కాపాడారు. వీరిద్దరూ ముంబై బౌలింగ్‌ను చీల్చి చెండాడు. రీతురాజ్ తర్వాత శివమ్ దూబే కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా వీరిద్దరి విడదీశాడు.
రితురాజ్ గైక్వాడ్ 40 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 69 పరుగులు చేసి ఔటయ్యాడు. దూబే, గైక్వాడ్‌లు మూడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రీతురాజ్ తర్వాత డారెల్ మిచెల్ రంగంలోకి దిగాడు. అయితే మిచెల్ నెమ్మదిగా ఆడటంతో చెన్నై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే 14 బంతుల్లో 17 పరుగులు చేసి డారెల్ ఔటయ్యాడు. అయితే 20వ ఓవర్ లో డారెల్ తర్వాత ధోనీ రంగంలోకి దిగాడు.
మిగిలిన 4 బంతుల్లో తొలి 3 బంతుల్లో వరుసగా 3 సిక్సర్లు బాదిన ధోనీ.. చివరి బంతికి 2 పరుగులు చేశాడు. ధోనీ వరుసగా 3 సిక్సర్లు బాది అభిమానులను ఆనందింపజేస్తుండగా, హార్దిక్ ముఖం వాచిపోయింది. ధోనీ ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను ఆనందపరిచింది. 500 స్ట్రైక్ రేట్ వద్ద ధోనీ 4 బంతుల్లో అజేయంగా 20 పరుగులు చేశాడు. చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసి ముంబైకి 207 పరుగులకే సవాలు విసిరింది. ఆ తర్వాత హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు గెలిచింది.
MS DHONI – 6,6,6 IN THREE CONSECUTIVE BALLS IN 20th OVER. 🤯🔥🦁 pic.twitter.com/accAqHFhl7
— Johns. (@CricCrazyJohns) April 14, 2024
మరిన్ని ఐపీఎల్ క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి