AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమిర్ పాక్ మొనగాడు… ట్రోలర్లకు భార్య నర్గీస్ కౌంటర్!

ఇటీవలే టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన పాకిస్తాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్లు విరుచుకుపడ్డారు. టెస్టు ఫార్మాట్‌ను వదిలి, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవుతానంటూ ఆమిర్‌ పేర్కొనడం పలువురు దిగ్గజ క్రికెటర్లను విస్మయానికి గురి చేసింది. 27 ఏళ్లకే టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పి పాక్‌ క్రికెట్‌కు ద్రోహం చేశాడంటూ షోయబ్‌ అక్తర్‌ ఘాటుగా స్పందించాడు. ఇది ఆమిర్‌ తొందరపాటు నిర్ణయమని వసీం అక్రమ్‌ సైతం పేర్కొన్నాడు. […]

ఆమిర్ పాక్ మొనగాడు... ట్రోలర్లకు భార్య నర్గీస్ కౌంటర్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 01, 2019 | 3:38 PM

Share

ఇటీవలే టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన పాకిస్తాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్లు విరుచుకుపడ్డారు. టెస్టు ఫార్మాట్‌ను వదిలి, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవుతానంటూ ఆమిర్‌ పేర్కొనడం పలువురు దిగ్గజ క్రికెటర్లను విస్మయానికి గురి చేసింది. 27 ఏళ్లకే టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పి పాక్‌ క్రికెట్‌కు ద్రోహం చేశాడంటూ షోయబ్‌ అక్తర్‌ ఘాటుగా స్పందించాడు. ఇది ఆమిర్‌ తొందరపాటు నిర్ణయమని వసీం అక్రమ్‌ సైతం పేర్కొన్నాడు. ఆమిర్‌ ఇంగ్లండ్‌కు మకాం మార్చనున్నాడన్న వదంతులు కూడా వ్యాపించాయి.

ఇలా ఆమిర్‌పై విమర్శలు రావడంతో అతని భార్య నర్గీస్‌ మాలిక్‌ ‘ నా భర్త నిజాయితీనే ప్రశ్నిస్తారా’ అంటూ ఎదురుదాడికి దిగారు. ‘ పాకిస్తాన్‌ క్రికెటర్‌గా ఆమిర్‌ ఎంతో గర్విస్తాడు. అతని నిజాయితీని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఆమిర్‌ టెస్టు రిటైర్మెంట్‌పై ఎవ్వరికీ సమాధానం చెప్పాల్పిన పనిలేదు. ప్రజలంతా ఆమిర్‌కు మద్దతుగా ఉన్నారు. ఇంగ్లండ్‌కు ఆడాల్సిన అవసరం ఆమిర్‌కు లేదు. పాకిస్తాన్‌కు తప్ప మరే దేశానికి ఆమిర్‌ ప్రాతినిథ్యం వహించడు. పాకిస్తాన్‌ తరఫున క్రికెట్‌ ఆడటాన్ని ఆమిర్‌ ఎంతగానో ఆస్వాదిస్తాడు. ఒకవేళ మా కూతురు క్రికెట్‌ ఆడాలనుకుంటే పాక్‌కే ఆడుతుంది కానీ ఇంగ్లండ్‌కు కాదు. ఆమిర్‌ రిటైర్‌ అయ్యింది కేవలం టెస్టు క్రికెట్‌ నుంచే కానీ ఓవరాల్‌ క్రికెట్‌ నుంచి కాదనే విషయం తెలుసుకోవాలి. వన్డేలు, టీ20ల్లో దేశం గర్వించేలా ఆమిర్‌ ఆడతాడు’ అని బ్రిటీష్‌ సంతతికి చెందిన నర్గీస్‌ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
పుట్టింటి నుంచి భార్యను తిరిగి తెచ్చుకున్నాడు.. ఇలా ఇంటికి..
పుట్టింటి నుంచి భార్యను తిరిగి తెచ్చుకున్నాడు.. ఇలా ఇంటికి..
గుండెపోటు వచ్చిన వెంటనే ఇలా చేస్తే.. మీ ప్రాణం పదిలమే!
గుండెపోటు వచ్చిన వెంటనే ఇలా చేస్తే.. మీ ప్రాణం పదిలమే!