AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్.. కట్‌చేస్తే.. కన్నీళ్లతో మైదానం వీడిన స్విస్ స్టార్

Argentina vs Switzerland: స్విట్జర్లాండ్ ఆటగాడు డాన్ న్డోయే 67వ నిమిషంలో గోల్ కొట్టి మ్యాచ్‌ను 1-1తో సమం చేసిన కొద్దిసేపటికే ఈ రెడ్ కార్డ్ సంఘటన జరిగింది. అంతవరకు మ్యాచ్‌పై పట్టు సాధిస్తున్న స్విస్ జట్టు, ఒక ఆటగాడు తగ్గడంతో రక్షణ వలయంలో పడిపోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ అదనపు సమయానికి (ఎక్స్‌ట్రా టైమ్) దారితీసింది.

ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్.. కట్‌చేస్తే.. కన్నీళ్లతో మైదానం వీడిన స్విస్ స్టార్
Switzerland Coach Slams Unacceptable Embolo Red Card
Venkata Chari
|

Updated on: Jul 13, 2026 | 9:12 AM

Share

Argentina vs Switzerland: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అరుదైన, వివాదాస్పద నిర్ణయానికి కాన్సాస్ సిటీ స్టేడియం వేదికైంది. అర్జెంటీనాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో వీడియో అసిస్టెంట్ రెఫరీ (వార్) తీసుకున్న ఒక విచిత్ర నిర్ణయం కారణంగా రెడ్ కార్డ్ పొంది మైదానంలోనే కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సంచలన నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని శాసించడమే కాకుండా, క్రీడా లోకంలో తీవ్ర చర్చకు దారితీసింది.

రెఫరీ పొరపాటు.. ‘వార్’ తిరకాసు..!

మ్యాచ్ 72వ నిమిషంలో స్విస్ ఫార్వర్డ్ బ్రీల్ ఎంబోలో బంతితో దూసుకుపోతుండగా, అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరేడెస్ అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఎంబోలో కిందపడిపోవడంతో మైదానంలో ఉన్న పోర్చుగీస్ రెఫరీ జోవావ్ మొదట పరేడెస్‌కు ఎల్లో కార్డ్ ఇచ్చారు. అయితే, వీడియో అసిస్టెంట్ రెఫరీ ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది. రీప్లేలో పరేడెస్ కాళ్లు తగలక ముందే ఎంబోలో కింద పడటానికి ప్రయత్నించినట్లుతేలింది. దీనితో ‘మిస్టేకెన్ ఐడెంటిటీ’ నిబంధనను వాడుతూ రెఫరీ పరేడెస్ ఎల్లో కార్డ్‌ను రద్దు చేసి, ఉద్దేశపూర్వకంగా కిందపడినందుకు ఎంబోలోకు ఎల్లో కార్డ్ ఇచ్చారు. ఎంబోలోకు ఇది రెండో ఎల్లో కార్డ్ కావడంతో అది కాస్తా రెడ్ కార్డ్‌గా మారి మైదానం వీడాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

20 ఏళ్ల రికార్డు.. కన్నీటి పర్యంతమైన ఎంబోలో..

ప్రపంచ కప్ చరిత్రలో ఇలా కిందపడి ఫౌల్ కోసం నటించినందుకు ఒక ఆటగాడికి రెండో ఎల్లో కార్డ్ ఇచ్చి పంపించేయడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరగా 2006లో అసమోవా గ్యాన్ ఇలాంటి తప్పుకే రెడ్ కార్డ్ పొందాడు. ఈ నిర్ణయం వెలువడగానే స్విట్జర్లాండ్ ఆటగాళ్లు, కోచ్ మురత్ యాకిన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తన తప్పేమీ లేదంటూ రెఫరీతో వాదించిన ఎంబోలో, చివరకు ఏడుస్తూ మైదానాన్ని వీడాడు. సహచర ఆటగాళ్లు అతడిని ఓదారుస్తూ డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు.

ఓడిన స్విట్జర్లాండ్.. సెమీస్‌కు అర్జెంటీనా..

స్విట్జర్లాండ్ ఆటగాడు డాన్ న్డోయే 67వ నిమిషంలో గోల్ కొట్టి మ్యాచ్‌ను 1-1తో సమం చేసిన కొద్దిసేపటికే ఈ రెడ్ కార్డ్ సంఘటన జరిగింది. అంతవరకు మ్యాచ్‌పై పట్టు సాధిస్తున్న స్విస్ జట్టు, ఒక ఆటగాడు తగ్గడంతో రక్షణ వలయంలో పడిపోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ అదనపు సమయానికి (ఎక్స్‌ట్రా టైమ్) దారితీసింది. పది మందితోనే అర్జెంటీనాను అడ్డుకునేందుకు స్విస్ డిఫెండర్లు పోరాడినప్పటికీ, అదనపు సమయంలో అర్జెంటీనా ఆటగాళ్లు జూలియన్ అల్వారెజ్ (112వ నిమిషం), లౌటారో మార్టినెజ్ (120వ నిమిషం) చెరో గోల్ కొట్టి స్విస్ ఆశలపై నీళ్లు చల్లారు. చివరికి అర్జెంటీనా 3-1 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

“ఈ ఒక్క నిర్ణయం మా మ్యాచ్‌ను నాశనం చేసింది, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు” అని స్విస్ ప్రధాన కోచ్ మురత్ యాకిన్ మ్యాచ్ అనంతరం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికత ఆటను మరింత పారదర్శకంగా మార్చడానికి ఉపయోగపడాలి కానీ, ఇలా ఒక జట్టు కలలను ముక్కలు చేసేలా ఉండకూడదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం
భూమిపూజకు వచ్చి పరుగులు తీసిన ప్రజాప్రతినిధులు.. ఏం జరిగిందంటే?
భూమిపూజకు వచ్చి పరుగులు తీసిన ప్రజాప్రతినిధులు.. ఏం జరిగిందంటే?
ఉదయాన్నే రెండు స్పూన్లు తీసుకుంటే లైఫంతా జిల్ జిల్ జిగా జిగా..
ఉదయాన్నే రెండు స్పూన్లు తీసుకుంటే లైఫంతా జిల్ జిల్ జిగా జిగా..