AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran War Updates: విజృంభించిన అమెరికా.. ఇరాన్‌కు చెందిన 140 ప్రదేశాలపై భీకర దాడులు..

అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం మళ్లీ మొదటికొచ్చింది. ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు దిగుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌కు చెందిన 140 ప్రదేశాలపై అమెరికా దాడికి దిగగా.. గల్ప్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేస్తోంది.

Iran War Updates: విజృంభించిన అమెరికా.. ఇరాన్‌కు చెందిన 140 ప్రదేశాలపై భీకర దాడులు..
America And Iran War
Venkatrao Lella
|

Updated on: Jul 13, 2026 | 8:54 AM

Share

అమెరికా-ఇరాన్ యుద్దం మళ్లీ మొదలైంది. కొద్ది రోజుల క్రితమే ఇరు దేశాలు శాంతి ఒప్పందం చేసుకోగా.. అది మున్నాళ్ల మచ్చగానే మిగిలిపోయింది. శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి రెండు దేశాలు మళ్లీ వార్‌కు దిగాయి. నాలుగు రోజులుగా భీకర దాడులు చేసుకుంటుండటంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజామున అమెరికా ఇరాన్‌పై దాడులు ప్రారంభించింది. దీంతో ఇరాన్ రంగంలోకి దిగి బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై క్షిపణులతో దాడులు చేపట్టింది.

“అనధికారిక మార్గంలో” ప్రయాణిస్తోందంటూ ఒక నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. తమ మార్గాన్ని సరిదిద్దుకుని ఆమోదించబడిన మార్గంలో ప్రయాణించాలన్న తమ హెచ్చరికలను, సూచనలను కొన్ని నౌకలు ధిక్కరించాయని ఇరాన్ తెలిపింది. ఈ సంఘటన నేపథ్యంలో ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం ముగిసే వరకు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తాము, ఏ నౌకలను కూడా దాని గుండా వెళ్ళడానికి అనుమతించని ఇరాన్ ప్రకటించింది. ఎలాంటి ప్రతీకార చర్యకైనా తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఇరాన్‌పై అమెరికా మళ్లీ దాడులను ప్రారంభించింది. హోర్ముజ్ మూసివేశాక అమెరికా 140 ఇరాన్ లక్ష్యాలపై దాడి చేయగా.. యూఏఈ, ఖతార్‌లపై ఇరాన్ దాడి చేసింది.

వాణిజ్య నౌకలపై గతంలో జరిగిన దాడుల తర్వాత అవగాహన ఒప్పందానికి కట్టుబడి ఉంటామని నిరూపించుకోవడానికి ఇరాన్‌కు మరో అవకాశం కల్పించినప్పటికీ, అది మళ్లీ విఫలమైందని అమెరికా చెబుతోంది. దీనికి ప్రతిస్పందనగా హార్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించే పౌర నావికులు, వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని నిరంతరం బలహీనపరుస్తూ ఉంటామంది. ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ స్థావరాలు, నౌకాదళ సామర్థ్యాలు, మందుగుండు సామగ్రి నిల్వ సౌకర్యాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, తీరప్రాంత నిఘా స్థానాలపై అమెరికా దాడులు చేపడుతోంది. ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలోని మీడియా, దేశ దక్షిణ తీరప్రాంతంలోని బుషెహర్, అసలూయే వంటి ఇంధన, పెట్రోకెమికల్ కేంద్రాలపై పేలుళ్లు జరిపింది. ఇక దీనికి ప్రతిస్పందనగా.. గల్ప్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేపడుతోంది. దీంతో ఈ యుద్దం తారాస్థాయికి చేరుకుంటుండగా.. మరోవైపు శాంతికి చర్చలు జరుగుతున్నాయి. యుద్దం మళ్లీ మొదలవ్వడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇదే కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర