AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: భూమిపూజకు వచ్చి పరుగులు తీసిన ప్రజాప్రతినిధులు.. ఏం జరిగిందంటే?

కేంద్రీయ విద్యాలయ భూమిపూజ కార్యక్రమంలో అనూహ్యంగా పాముల కలకలం చోటుచేసుకుంది. కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో వేదిక సమీపంలో వరుసగా నాలుగు పాము పిల్లలు కనిపించడంతో ప్రజలు, అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాఠీల సహాయంతో పాములను అక్కడి నుంచి సురక్షితంగా తరిమివేశారు..

Watch Video: భూమిపూజకు వచ్చి పరుగులు తీసిన ప్రజాప్రతినిధులు.. ఏం జరిగిందంటే?
Jagtial Bhoomi Pooja Event
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jul 13, 2026 | 8:21 AM

Share

జగిత్యాల, జులై 13: జగిత్యాల జిల్లా చల్‌గల్‌లో నిర్వహించిన కేంద్రీయ విద్యాలయ భూమిపూజ కార్యక్రమంలో అనూహ్యంగా పాముల కలకలం చోటుచేసుకుంది. కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో స్టేజ్ సమీపంలోకి వరుసగా నాలుగు పాము పిల్లలు రావడంతో అక్కడ ఉన్న ప్రజలు, అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాఠీల సహాయంతో పాములను అక్కడి నుంచి తరిమివేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎలాంటి ఘటన జరగకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ ధర్మపురి అరవింద్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పాములను సురక్షితంగా తరిమివేసిన అనంతరం భూమిపూజ కార్యక్రమాన్ని అధికారులు యథావిధిగా కొనసాగించారు. ఈ ఘటనతో కార్యక్రమం వద్ద కొద్దిసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొన్నప్పటికీ, అనంతరం అంతా సాధారణ స్థితికి చేరుకుంది. నాలుగు పాములు అదే ప్రాంతంలో సంచరించాయి. దీంతో హైరన పడ్డ పోలీసులు.. లాటిల సాయంతో వాటి దూరంగా పంపారు. అయినప్పటికీ… పాములు ఇదే ప్రాంతంలో కనబడడంతో కాసేపు ఆందోళన కనబడింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై కార్యక్రమం సజావుగా జరిగేవరకు వేదిక సమీపంలో ఉన్నారు. పాములు అక్కడ్నుంచి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఈ పాముల సంచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us