AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో చాలా గ్రేట్.. ఫోన్ చేసి అలా అడిగేసరికి.. చాలా సంతోషంగా అనిపించింది.

కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి, భర్త మరణానంతరం ఎదుర్కొన్న సవాళ్లను, ఆయన జ్ఞాపకాలను నిలబెట్టేందుకు చేస్తున్న కృషిని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కృష్ణంరాజు చనిపోయిన తర్వాత ప్రభాస్ ఇచ్చిన ధైర్యాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో లభిస్తున్న మద్దతు గురించి తెలిపారు.

ఆ హీరో చాలా గ్రేట్.. ఫోన్ చేసి అలా అడిగేసరికి.. చాలా సంతోషంగా అనిపించింది.
Shyamala Devi
Rajeev Rayala
|

Updated on: Jul 13, 2026 | 7:26 AM

Share

దివంగత రెబల్ స్టార్, నటుడు, రాజకీయ నాయకుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి, ఆయన మరణానంతరం తమ జీవితాన్ని, ఆయన జ్ఞాపకాలను కొనసాగించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కృష్ణంరాజు గారి జీవితం సినిమా రంగం, రాజకీయాలు అనే రెండు పడవల ప్రయాణంలా సాగిందని, ఈ రెండింటినీ ఆయన ఎంతో సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు గారి మరణం తర్వాత, తాను, పిల్లలు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినట్లు శ్యామల దేవి వెల్లడించారు. ఇంకా లేవలేమేమో అన్నంత పరిస్థితి నెలకొందని ఆమె ఆ సమయంలో పడిన వేదనను తెలిపారు.

ఇది కూడా చదవండి : జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ నటి

అలాంటి క్లిష్ట సమయంలో ఆమె కుమారుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఇచ్చిన సలహా ఆమె జీవితానికి ఒక కొత్త దిశను చూపిందని తెలిపారు. “మీకు పెదనాన్న అంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, మన దగ్గరే ఉన్నారు. సంపూర్ణమైన జీవితం అనుభవించి, ఆయన మన దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మీరు బాధపడ్డారు, రోజు బాధపడుతున్నారు, డిప్రెషన్ లోకి వెళ్తున్నారు అంటే ఆయనని నమ్ముకుని ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ మీరు పెదనాన్న ఉన్నట్టుగా చూపించాలి కదా. మీరు బాధపడితే ఎవ్వరూ మీ దగ్గరికి రారు. అప్పుడు పెదనాన్న మీ దగ్గర లేనట్టే కదా. ఆయన ఉన్నారు, మనతోనే అనుకుంటే మీరు లేవాలి, తిరగాలి, బయటికి వెళ్ళాలి” అని తన కుమారుడు చెప్పిన మాటలు తనను ఆలోచింపజేశాయని అన్నారు.

ఇది కూడా చదవండి : ఆమెకు19 ఆయనకు 31..! 20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్

ఆ మాటలతో ప్రేరణ పొందిన శ్యామల దేవి, బాధపడే కన్నా కృష్ణంరాజు గారి జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తూ, నలుగురిలోకి వెళ్తే వారు కూడా ఆనందపడతారని భావించి బయటికి రావడం మొదలుపెట్టా అన్నారు. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలకు హాజరవుతూ, ప్రజలతో మమేకమవుతున్నా అన్నారు. అలాగే సినీ రంగంలో బాలకృష్ణ, మురళీ మోహన్ వంటి ప్రముఖులు, అలాగే కృష్ణ గారి కుటుంబ సభ్యులు తమ కార్యక్రమాలకు ఆమెను ఆహ్వానిస్తున్నారని, ఈ గౌరవం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇటీవల బాలకృష్ణ గారు తనకు ఫోన్ చేసి, తన సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. బాలయ్య ఫోన్ చేసి “మీరు వస్తే కృష్ణంరాజు గారు వచ్చినట్లే. నాకు పెద్దాయన అంటే చాలా గౌరవం. దయచేసి వచ్చి మీ ఆశీర్వాదం ఇవ్వండి” అని బాలకృష్ణ అన్న మాటలు తనకెంతో సంతోషాన్ని కలిగించాయని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు

Balakrishna

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
అమెరికా వెళ్తున్నారా..? విమానాశ్రయంలో మీ ఫోన్లు చెక్‌ చేయొచ్చు!
అమెరికా వెళ్తున్నారా..? విమానాశ్రయంలో మీ ఫోన్లు చెక్‌ చేయొచ్చు!
భారత ఆర్థిక వ్యవస్థపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు..!
భారత ఆర్థిక వ్యవస్థపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు..!
ఆయన 12వేల పరుగులు చేసిన తోపేమో.. నా ముందు మాత్రం ఓ బచ్చా
ఆయన 12వేల పరుగులు చేసిన తోపేమో.. నా ముందు మాత్రం ఓ బచ్చా
ఇది ఒక గ్లాసెడు తాగితే.. నరాల నొప్పి, తిమ్మిర్లకు పూర్తిగా చెక్
ఇది ఒక గ్లాసెడు తాగితే.. నరాల నొప్పి, తిమ్మిర్లకు పూర్తిగా చెక్
వెండి, రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో..
వెండి, రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో..
భారత్ vs వెస్టిండీస్ పోరుకు రెడీ.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
భారత్ vs వెస్టిండీస్ పోరుకు రెడీ.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
2027 నాటికి బంగారం ధర రికార్డు స్థాయికి? షాకింగ్‌ నివేదిక
2027 నాటికి బంగారం ధర రికార్డు స్థాయికి? షాకింగ్‌ నివేదిక
ఇవి తింటే కంటి సైట్, మంట రాదు.. 24 గంటల్లోనే కళ్ల జోడుకు గుడ్ బై
ఇవి తింటే కంటి సైట్, మంట రాదు.. 24 గంటల్లోనే కళ్ల జోడుకు గుడ్ బై