AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు TET 2026 ఫలితాలు.. స్కోర్‌కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

TG TET 2026 Result Date and Time: టెట్‌ జూన్‌ సెషన్ 2026 ఫలితాలను పాఠశాల విద్యాశాఖ నేడు విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 16 నుంచి 22 వరకు నిర్వహించిన ఆన్‌లైన్‌ పరీక్షలకు 1.53 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..

నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు TET 2026 ఫలితాలు.. స్కోర్‌కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
Telangana TET June Results
Srilakshmi C
|

Updated on: Jul 13, 2026 | 8:03 AM

Share

హైదరాబాద్‌, జులై 13: రాష్ట్ర టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్‌-జూన్‌2026) ఆన్‌లైన్‌ పరీక్షల ఫలితాలు ఈ రోజు (జులై 13) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ విడుదల చేస్తారని టెట్‌ కన్వీనర్‌ రమేశ్‌ తెలిపారు. విద్యాశాఖ సోమవారం (జూలై 13న) మధ్యాహ్నం 2:30 గంటలకు టెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం నుంచి ఈ ఫలితాలను ప్రకటిస్తారు. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి టెట్ మార్కులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ టెట్‌ 2026 జూన్‌ స్కోర్‌కార్డు డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా జూన్‌ 16 నుంచి 22 వరకు 10 సెషన్లుగా రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జూన్ సెషన్‌లో నిర్వహించిన టెట్ పరీక్షలకు సంబంధించి మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 1 నుండి 5 తరగతులు బోధించే పేపర్ 1 పరీక్షకు 50,113 మంది, 6 నుంచి 8 తరగతులు బోధించే పేపర్ 2 పరీక్షకు 1,03,639 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌ మార్కులకు DSC ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక ఒక సారి టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్‌కు లైఫ్‌టైమ్ (జీవితకాల) చెల్లుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. టెట్‌లో జనరల్ అభ్యర్ధులు 90 మార్కులు (60 శాతం), బీసీ అభ్యర్ధులు 75 మార్కులు (50 శాతం), ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్ధులు 60 మార్కులు (40 శాతం) సాధిస్తే అర్హత పొందుతారు.

తెలంగాణ టెట్‌ 2026 జూన్‌ స్కోర్‌కార్డు డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో 2011 సంవత్సరం కంటే ముందు ఉద్యోగాల్లో చేరి, ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31 నాటికి తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంది. లేదంటే సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్‌ రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఇన్‌ సర్వీస్‌ టీచర్లంతా టెట్‌లో అర్హత సాధించడానికి పరీక్షలు రాస్తున్నారు.

Follow Us