ఉదయాన్నే రెండు స్పూన్లు ఇది తీసుకుంటే లైఫంతా జిల్ జిల్ జిగా జిగా..
మన వంటింట్లో నిత్యం ఉపయోగించే అల్లం కేవలం రుచికోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అల్లం రసం జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడం, కీళ్ల నొప్పులను ఉపశమనం చేయడం, మెదడు పనితీరును మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలు కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు.

పూర్వకాలంలో, చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు ఇంటి చిట్కాలతో చికిత్స చేసుకునేవారు. వారి ఆహారపు అలవాట్లు, సంప్రదాయ వైద్య విధానాలు వారి దీర్ఘాయుష్షుకు, ఆరోగ్యానికి కారణమయ్యాయని ఆయుర్వేద నిపుణులు తరచూ చెబుతుంటారు. మన వంటింట్లో నిత్యం ఉపయోగించే అల్లం, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అల్లంలో ఉండే అనేక పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే, వీలైన సందర్భాల్లో అల్లం రసం తీసుకోవాలని.. దీనివల్ల ఆరోగ్యవంతంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అల్లం రసం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం..
అల్లం రసం ప్రయోజనాలు..
- అల్లం రసం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా, పరగడుపున అల్లం రసం త్రాగడం చాలా మంచిది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, భోజనానికి అరగంట ముందు అల్లం రసంలో నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల ఆకలి లేని వారికి కూడా ఆకలి పుడుతుంది.
- జ్వరం వచ్చినప్పుడు రెండు చెంచాల అల్లం రసం, రెండు చెంచాల తులసి ఆకుల రసం, ఒక చెంచా తేనె కలిపి రోజుకు మూడుసార్లు, మూడు రోజుల పాటు తీసుకుంటే జ్వరం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
- తరచుగా అల్లం రసం త్రాగడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని ఒక అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అల్లం సహాయపడుతుందని, క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
- అల్లం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. 60 సంవత్సరాలు పైబడిన వారిపై జరిపిన పరిశోధనలో, అల్లం వినియోగం జ్ఞాపకశక్తిని పెంచినట్లు గుర్తించారు. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. చదువుకునేవారు, ఉద్యోగస్తులు అల్లం తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
- వికారం, వాంతులతో బాధపడేవారు ఉల్లిపాయ రసం, అల్లం రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. జలుబు, దగ్గు, ఆస్తమా సమస్యలతో బాధపడేవారికి అల్లం టీ చాలా సహాయకారిగా ఉంటుంది. అల్లం శరీరంలో ఇన్ఫెక్షన్లపై పోరాడి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిన్నచిన్న వ్యాధులు దరిచేరకుండా అల్లం కాపాడుతుంది.
- అల్లం ఆడవారిలో నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. పరగడుపున అల్లం రసం త్రాగడం వల్ల బద్ధకం, మార్నింగ్ సిక్నెస్ తగ్గుతాయి. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది, కాబట్టి అల్లం రసం తీసుకోవడం వల్ల కీళ్లనొప్పులు రాకుండా నివారించవచ్చు.
- అరికాళ్ళు, అరచేతులు పొటు రాలటం, తిమ్మిర్లు, అధికంగా చెమట పట్టడం వంటి సమస్యలతో బాధపడేవారు అల్లం, జీలకర్ర, బెల్లం సమభాగాలుగా నూరి, ఆ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
- అల్లం నోటి దుర్వాసనను పోగొట్టి, నోటిలోని హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, తద్వారా దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్లం రసం రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాలను శుభ్రం చేసి గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది.
- అల్లం రసంలో తేనె కలిపి తీసుకుంటే శృంగార శక్తి పెరుగుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఇది మగవారిలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుందని, తద్వారా భార్యాభర్తల జీవితం ఆనందంగా ఉండేలా చేస్తుందని ఒక అధ్యయనంలో తేలింది.
అల్లం రసం ఎలా తీసుకోవాలి..?
ఇలా అల్లం అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక అద్భుతమైన సహజ ఔషధం.. అయితే.. అల్లం రసం రోజుకు మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. నేరుగా తీసుకుంటే.. ఒకటి లేదా రెండు స్పూన్లు సరిపోతుంది. ఇది వేడి ప్రభావంతో ఉండటంతోపాటు.. ఘాటైన రసం కాబట్టి, నేరుగా తాగకుండా గోరువెచ్చని నీటిలో లేదా తేనె, నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నాయి.
ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఏయైని సమస్యలుంటే.. నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
