EPFO: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. నగదు ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ.. కొత్త ఆప్షన్లు వచ్చేశాయి..
ఈపీఎఫ్ఓ ఇటీవల ప్రస్తుతం ఉన్న పోర్టల్‌లో మార్పులు చేసింది. అనేక ఆప్షన్లను తొలగించి కొత్త ఆప్షన్లను తీసుకొచ్చింది. పీఎఫ్ ఆన్‌లైన్ సేవలు వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పోర్టల్ ద్వారా వేగంగా సేవలు పొందవచ్చు. ఇక పీఎఫ్ మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం కూడా సులువు అయింది.

పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఈపీఎఫ్ఓ మరో శుభవార్త అందించింది. రెండు వారాల తర్వాత ఈపీఎఫ్ఓ పోర్టల్ ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తోంది. ప్రధాన డేటాబేస్ ఏకీకరణ, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కారణంగా జూన్ 26వ తేదీ నుంచి పలు పీఎఫ్ సేవలు నిలిచిపోగా.. ఇప్పుడిప్పుడే పునరుద్దరిస్తున్నారు. అయితే సిస్టమ్ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా పీఎఫ్ పోర్టల్‌లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక నుంచి ఉద్యోగాలు మారినప్పుడు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీలోకి పీఎఫ్ అకౌంట్‌ను బదిలీ చేయడం మరింత సులువుకానుంది. ఇందుకోసం ఇప్పుడు రెండు ఆప్షన్లను పీఎఫ్ సంస్థ కల్పిస్తోంది. గతంలో ఒక మార్గం మాత్రమే ఉండగా.. ఇప్పుడు మరో దానిని జోడించింది. ఆ రెండు మార్గాలంటో ఇప్పుడు చూద్దాం.
ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ బదిలీ ప్రక్రియను సులభతరం చేయడం, కాగితపు పనిని తగ్గించడం, ఎటువంటి విధానపరమైన జాప్యం లేకుండా ఉద్యోగులు తమ పదవీ విరమణ పొదుపును ఒకేచోటకు చేర్చుకోవడంలో సహాయం చేసేందుకుు ఈపీఎఫ్‌వో పీఎఫ్ అకౌంట్ బదిలీ ప్రక్రియను సులభతరం చేసింది. ఇక నుంచి అత్యంత సులువుగా పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఒక కంపెనీ నుంచి కొత్త కంపెనీలోకి మార్చుకోవచ్చు. పీఎఫ్ పోర్టల్‌లో ఆన్‌లైన్ సర్వీసెస్ ట్యాబ్‌లోని ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా మార్చుకోవచ్చు. ఇక మొబైల్ సర్వీస్ హిస్టరీలోని సర్వీస్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ ద్వారా ఛేంజ్ చేసుకోవచ్చు.
ట్రాన్స్‌ఫర్ ఎలా చేసుకోవాలి..?
-https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్‌లోకి వెళ్లాలి
-మీ యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేసి సైన్ ఇన్‌పై క్లిక్ చేయాలి
-ఆ తర్వాత మొబైల్ నెంటర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
-హోమ్ పేజీలో ఆన్‌లైన్ సర్వీసెస్ ట్యాబ్ ఎంచుకోవాలి
-అనంతరం ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్‌పై క్లిక్ చేయాలి
-అక్కడ గత కంపెనీ మెంబర్ ఐడీ క్లిక్ చేసి గెట్ డీటైల్స్‌పై క్లిక్ చేయాలి
-ఆధార్‌తో అనుసంధానించబడ్డ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేయాలి
-అనంతరం ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ వివరాలు అందుతాయి. ఈ వివరాలు ఒకసారి చెక్ చేసుకోండి
-ఆ తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది
రెండో ఆప్షన్
ఈపీఎఫ్‌వో పోర్టల్‌లోకి లాగిన్ అయ్యాక మెంబర్ సర్వీస్ హిస్టరీ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీరు ప్రస్తుతం పనిచేస్తున్న, గతంలో పనిచేసిన కంపెనీల వివరాలు కనిపిస్తాయి. అక్కడ నో అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు అక్కడ క్లెయిమ్ లింక్‌పై క్లిక్ చేసి ఫారం 13 సబ్మిట్ చేయడం ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
