Bigg Boss 10 Telugu: అగ్నిపరీక్షలో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారుగా.. హెయిర్ కట్ కోసం అమ్మాయిల పోటీ..
బుల్లితెరపై అత్యధిక క్రేజ్ ఉన్న రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే తొమ్మిది సీజన్స్ కంప్లీట్ కాగా.. ఇప్పుడు పదవ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే సామాన్యుల సెలక్షన్ కోసం అగ్నిపరీక్ష 2 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టకముందే.. కేవలం సెలక్షన్స్ కోసం నిర్వహించే అగ్ని పరీక్షలో చెత్త టాస్కులతో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు.

బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఈ క్రమంలోనే సామాన్యుల ఎంపిక కోసం అగ్ని పరీక్ష 2 నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సైతం హౌస్ లోకి వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ హౌస్ లోకి వెళ్లడానికి ముందే టాస్కుల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. సెలబ్రిటీలు నేరుగా బిగ్ బాస్‌లోకి వచ్చి తమను తాము నిరూపించుకోవడానికి టాస్క్‌లు ఆడతారు. కానీ సామాన్యులు మాత్రం అంతకంటే కఠినమైన టాస్క్‌లను ఇక్కడే ఎదుర్కోవాల్సి వస్తోంది. అగ్నిపరీక్ష సీజన్ 2లో సెకండ్ రౌండ్ ప్రారంభమైంది.18 మంది కంటెండర్లను కంటెస్టెంట్లుగా మార్చడానికే ఇంత టార్చర్ చూపిస్తే, ఇక హౌస్ లోపల ట్రోఫీ కోసం వీరు ఇంకెంత పెద్ద యుద్ధం చేయాలో!అగ్నిపరీక్ష 2లో రెండో రౌండ్ ఒక చెత్త టాస్క్‌తో మొదలైంది. వారం రోజులు కుళ్లబెట్టిన చెత్త కంపును భరిస్తూ.. లాక్ ఓపెన్ చేసే కీ కోసం వెతకాలి. లాక్ తెరిచిన తర్వాత అందులో ఉన్న జ్యూస్‌ను పూర్తిగా తాగితేనే ఆ టాస్క్ పూర్తవుతుంది. ఈ టాస్క్ చేయడానికి చాలామంది ముందుకు వచ్చినప్పటికీ, ఆఖరిగా అమన్, షాలినీ పోటీ పడ్డారు. ఇద్దరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ, చాలా చిన్న తేడాతో షాలినీ గెలిచి కంటెస్టెంట్‌గా మారింది. అమన్ చేసిన ప్రయత్నానికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి.
ఎక్కువమంది చదివినవి : Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..
ఇక రెండో టాస్కులో మాజీ లవర్స్ కు కాల్ చేసి మళ్లీ జీవితంలో కలవాలి. ఐ లవ్యూ చెప్పాలి.. సారీ అడగాలి అని టాస్క్ ఇవ్వగా.. గంటను ముందు పట్టుకుని ఛాన్స్ కొట్టేస్తుంది శ్రష్టి. దీంతో తన మాజీ లవర్ కు కాల్ చేసి తప్పైందని.. సారీ అని.. ఐ లవ్యూ నువ్వు లేకపోతే నేను లేను అని మాట్లాడుతుంది. దీంతో అవతలి వ్యక్తి సరే అని సైలెంట్ గా ఉండగా.. ఇప్పుడు ఇలా ఫోన్ చేసి మాట్లాడడం నా తప్పే అని ఫోన్ కట్ చేస్తుంది. తప్పు చేసిన మనిషి వద్దని అనుకున్నా వాడికి కాల్ చేసి మాట్లాడడం గ్రేట్ అంటూ శ్రష్టిపై ప్రశంసలు కురిపించారు అభిజిత్, నవదీప్, బింధు మాధవి. అలా శ్రష్టి సైతం టాప్ 15లో స్థానం లభిస్తుంది. అలాగే మూడో టాస్కు టాటూ. నుదుటిపై తూ నా బతుకు అని టాటూ వేసుకోవాలని చెప్తారు. చివరకు కృష్ణ అనే కంటెస్టెంట్ తూ నా బతుకు అని టాటూని వెయించుకుని టాప్ 15లో నిలిచాడు.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..
ఇక హెయిర్ కట్ టాస్కు కోసం అమ్మాయిలు అంతా రెడీ కగా.. భాగి అనే కంటెస్టెంట్ బెల్ పట్టుకుంటుంది. దీంతో ఆమెకు హెయిర్ స్టైలీస్ట్ వచ్చి అబ్బాయిలా చిన్నగా కటింగ్ చేస్తాడు. ఇక భాగి కూడా టాప్ 15లోకి వెళ్తుంది. చివరగా రెండు టాప్ 15, రెండు ఎగ్జిట్ కార్డ్స్ ఉంటాయి. ఇద్దరు వచ్చి వీటిని సెలక్ట్ చేసుకోవాలి. అందులో ఎగ్జిట్ వస్తే ఓ టాస్క్ పెడతాం. గెలిచిన వాళ్లు హోల్డ్.. ఓడినవాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్తారు. దీంతో హేమంత్, వెంకటేశ్ ఈ టాస్కు ఆడగా.. ఇద్దరూ ఎగ్జిట్ కార్డ్ తీస్తారు. ఇద్దరికి బురద టాస్క్ ఇవ్వగా.. ఇందులో హేమంత్ గెలవగా.. వెంకటేశ్ బయటకు వెళ్లిపోతాడు. ఎపిసోడ్ పూర్తయ్యే సరికి టాప్ 15లో ఏడు మంది హోల్డ్ లో 13 మంది ఉంటారు. రేపటి టాస్కులో 15 మెంబర్స్ ఫిల్ అయిపోతారు.
ఎక్కువమంది చదివినవి : Mokshagna : వారసుడు వచ్చేస్తున్నాడు.. దసరాకు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..
ఎక్కువమంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్‌తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే.. ఆ నిర్ణయమే పొరపాటు అయ్యింది..
