AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..? నో టెన్షన్.. ఇలా చేస్తే మీ డబ్బులు సేఫ్..

యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లేదా మొబైల్ నెంబర్, యూపీఐ ఐడీ నమోదు చేయడం ద్వారా డబ్బులు బదిలీ చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు పేమెంట్ ఫెయిల్యూర్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అవుతాయి. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

UPI Payments: యూపీఐ పేమెంట్ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..? నో టెన్షన్.. ఇలా చేస్తే మీ డబ్బులు సేఫ్..
Upi Payments
Venkatrao Lella
|

Updated on: Aug 21, 2026 | 1:27 PM

Share

ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువమంది యూపీఐ వాడుతున్నారు. యూపీఐ లావాదేవీలు దేశంలో రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరి ఫోన్లలో తప్పనిసరిగా ఏదైనా యూపీఐ యాప్ అనేది ఉంటుంది. అయితే దీని ద్వారా ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్నిసార్లు లావాదేవీ ఫెయిల్యూర్ అయినా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో వినియోగదారులు ఆందోళన చెందుతూ ఉంటారు. డబ్బులు తిరిగి వస్తాయా.. లేదా అనే భయంలో ఉంటారు. బ్యాంక్ లేదా యూపీఐ నెట్‌వర్క్‌లో టెక్నికల్ సమస్య కారణంగా ఇలా చెల్లింపులు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం.

లావాదేవీ ఫెయిల్ అయినా డబ్బులు కట్ అయ్యాయా..?

కొన్నిసార్లు లావాదేవీ ఫెయిల్ అయినప్పుడు అకౌంట్ నుంచి కట్ అయిన డబ్బులు ఆటోమేటిక్‌గా వెనక్కి వస్తాయి. కొన్ని సందర్భాల్లో డబ్బులు వెనక్కి క్రెడిట్ అవ్వవు. కొన్నిసార్లు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు మళ్లీ పేమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇలా చేయకపోవడం మంచిది. ఒక్కొసారి మొదటి లావాదేవీ తర్వాత విజయవంతమవుతుంది. దీంతో ఇలాంటి సమయంలో మీరు రెండుసార్లు చెల్లింపులు చేసినట్లు అవుతంది. దీంతో మొదటి ట్రాన్సాక్షన్ స్టేటస్ క్లియర్‌గా చెక్ చేసుకున్న తర్వాతనే రెండో ట్రాన్సాక్షన్ చేయండి. మీరు తప్పుడు ఈఎంఐ పిన్ ఎంటర్ చేయడం, అకౌంట్‌లో బ్యాలెన్స్ లేకపోవడం, బ్యాంక్ సర్వర్ సమస్యలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోవడం వంటి సమస్యల వల్ల సాధారణంగా యూపీఐ లావాదేవీలు ఫెయిల్ అవుతూ ఉంటాయి.

డబ్బులు వెనక్కి రాకపోతే ఏం చేయాలి..?

ముందుగా మీరు చెల్లింపులు చేసిన యూపీఐ యాప్ తెరవాలి. అక్కడ సమస్యను నివేదించండి అనే ఆప్షన్ ఎంచుకోవాలి. మీ లావాదేవీ రిఫరెన్స్ నెంబర్, ఆర్ఆర్ఎన్ నెంబర్‌తో పాటు లావాదేవీ స్క్రీన్ షాట్ వారితో పంచుకోండి. యూపీఐ యాప్ ద్వారా సమస్య పరిష్కారం కాని పరిస్థితుల్లో మీ బ్యాంక్‌ను సంప్రదించండి. లావాదేవీ రిఫరెన్స్ నెంబర్, చెల్లింపు తేదీ, సమయం, ఇతర వివరాలు వారితో పంచుకోండి. మీ నగదు అవతల వ్యక్తికి చేరకపోతే ఆర్బీఐ నిబంధనల ప్రకారం మరుసటి రోజుకల్లా డబ్బు అకౌంట్‌కి చేరుతుంది.   ఒకవేళ మీరు చేసిన మర్చంట్ చెల్లింపులో మీ ఖాతా నుండి డబ్బు తీసివేసినప్పటికీ.. మర్చంట్‌కు చేరని పక్షంలో నిర్దేశించిన రివర్సల్ గడువు ఐదు రోజుల వరకు ఉంటుంది. ఈ గడువు ముగిశాక రూ.100 చొప్పున నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.

Follow Us
వన్డే హిస్టరీలో ఆల్‌టైం టాప్ 7 భారీ స్కోర్లు
వన్డే హిస్టరీలో ఆల్‌టైం టాప్ 7 భారీ స్కోర్లు
నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ కమ్మటి పెరుగన్నం..!
నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ కమ్మటి పెరుగన్నం..!
కెమెరా కనిపిస్తే చాలు.. హీరోయిన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు?
కెమెరా కనిపిస్తే చాలు.. హీరోయిన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు?
నాని 'ది ప్యారడైజ్' కి సంపూర్ణేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్' కి సంపూర్ణేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కాదు.. మరో వ్యాపారంలోకి ఇండియన్ ఆయిల్..
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కాదు.. మరో వ్యాపారంలోకి ఇండియన్ ఆయిల్..
రవి అనుగ్రహం.. ఈ రాశులకు రాజయోగం.. కెరీర్, ఆర్థికంగా పురోగతి
రవి అనుగ్రహం.. ఈ రాశులకు రాజయోగం.. కెరీర్, ఆర్థికంగా పురోగతి
చేపలు పట్టేందుకు కుంటలో దిగి శవమై తేలాడు
చేపలు పట్టేందుకు కుంటలో దిగి శవమై తేలాడు
పులి, మేక, గడ్డి.. రైతు నది ఎలా దాటాలి? మీ తెలివికి బస్తీమే సవాల్
పులి, మేక, గడ్డి.. రైతు నది ఎలా దాటాలి? మీ తెలివికి బస్తీమే సవాల్
రూ.6.35 కోట్లు పెట్టుబడి.. యాప్‌లో రూ.2 కోట్ల లాభం! చివరకు షాక్..
రూ.6.35 కోట్లు పెట్టుబడి.. యాప్‌లో రూ.2 కోట్ల లాభం! చివరకు షాక్..
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే 15 రోజుల్లో వీరికి అదృష్టం
బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే 15 రోజుల్లో వీరికి అదృష్టం