AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: యూపీఐ పేమెంట్స్‌కు ఛార్జీలు విధింపు.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. ఇకపై రుసుం కట్టాల్సిందేనా..?

యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు విధింపునకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెిలిపారు. దీంతో త్వరలోనే చార్జీలను విధించే అవకాశముంది. ఈ మేరకు ఎన్‌పీసీఐ సిద్దమవుతోంది. వీటి వివరాలు చూస్తే..

UPI Payments: యూపీఐ పేమెంట్స్‌కు ఛార్జీలు విధింపు.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. ఇకపై రుసుం కట్టాల్సిందేనా..?
Upi
Venkatrao Lella
|

Updated on: Aug 20, 2026 | 3:00 PM

Share

యూపీఐ లావాదేవీలకు చార్జీలు విధింపునకు రంగం సిద్దమైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చేసిన చట్ట సవరణ బిల్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పన్నులు, ఇతర చట్టాల (సవరణ) చట్టం, 2026, చెల్లింపులు, పరిష్కార వ్యవస్థల చట్టం 2007 సవరణలకు సంబంధించిన చట్టాన్ని ద్రౌపది ముర్ము ఆమోదించారు. పార్లమెంట్ ఆగస్ట్ 10న ఈ రెండు బిల్లులను ఆమోదించింది. ఈ చట్టాల్లో చేసిన మార్పులతో యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు విధింపునుకు మార్గం సుగమమైంది. దీని వల్ల ఛార్జీల విధింపు చట్టబద్దంగా మారింది. ఈ సవరణల వల్ల సామాన్య వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, యూపీఐ లావాదేవీలు ఎప్పటిలాగే ఉచితంగా చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

సాధారణ ప్రజలకు ఉచితమే..

కానీ వినియోగదారులు యూపీఐ ట్రాన్సక్షన్లకు ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా? అనే దానిపై స్పష్టత లేదు. దీంతో తమపై ఏమైనా ఛార్జీలు పడతాయనే దాని దానిపై యూపీఐ వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా చేసి చట్ట సవరణతో డిజిటల్ ట్రాన్సాక్షన్లకు ఎండీఆర్ చార్జీలు విధించవచ్చు. డిజిటల్ చెల్లింపులకు రుసుంలు వసూలు చేయడాన్ని ఎండీఆర్ అని పిలుస్తారు. వ్యాపారులు లేదా సంస్థలు బ్యాంకులకు దీనిని చెల్లిస్తాయి. ప్రస్తుత విధానంలో యూపీఐ, రూపే డెబిట్ కార్డు ద్వారా చేసే ట్రాన్సాక్షన్లకు బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేయడం లేదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పాటు యూపీఐ సేవా కార్యకలాపాల కమిటీ ఎండీఆర ఛార్జీల విషయంలో నిర్ణయం తీసుకుంటుంది.

నగదు లావాదేవీలు పెరుగుతాయా..?

అయితే ప్రస్తుతం కేవలం పెద్ద వ్యాపారులు చేసే లావాదేవీలకు మాత్రమే ఎండీఆర్ ఛార్జీలు విధిస్తారని కేంద్రం చెబుతోంది. సాధారణ వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని స్పషటం చేసింది. ఎప్పటిలాగే చెల్లింపులు ఉచితంగా ఉంటాయని తెలిపింది. కానీ పెద్ద వ్యాపారస్తులకు ఛార్జీలు విధించడం వల్ల ఆ భారాన్ని వినియోగదారులపై వ్యాపారులు మోపే అవకాశముంది. దీని వల్ల సామాన్యులకు కూడా ప్రభావితం అవుతారు. ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారితీసి ప్రజలను తిరిగి నగదు లావాదేవీల వైపు మళ్లే చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు విధించడం వల్ల నగదు లావాదేవీలు పెరుగుతాయని అంటున్నారు.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర