AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. డైట్ ఛార్జీలు పెంపు, వారానికి 6 రోజులు గుడ్లు.. కొత్త మెనూ ఇదే!

BC hostel diet hike: బీసీ హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డైట్ ఛార్జీలను పెంచుతూ, నూతన పోషకాహార మెనూను ఖరారు చేసింది. పెరిగిన ఛార్జీలతో విద్యార్థులకు వారానికి ఆరు రోజులు గుడ్లు, మూడు రోజులు చికెన్, ప్రతిరోజూ పాలు, పండ్లు అందించనున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం మెరుగుపరచడమే ఈ నిర్ణయం లక్ష్యం.

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. డైట్ ఛార్జీలు పెంపు, వారానికి 6 రోజులు గుడ్లు.. కొత్త మెనూ ఇదే!
Bc Hostel Diet Hike
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Oct 01, 2026 | 8:15 PM

Share

బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఛార్జీలకు అనుగుణంగా నూతన మెనూను కూడా ఖరారు చేసింది. గుడ్లు, చికెన్, పాలు, పండ్లు వంటి పోషకాహారంతో విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం అందించనుంది ప్రభుత్వం.

డైట్ ఛార్జీల పెంపు

బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థుల డైట్ ఛార్జీలు పెరిగాయి.

  • 3 నుంచి 6వ తరగతి విద్యార్థులకు నెలకు 1150 రూపాయలుగా ఉన్న డైట్ ఛార్జీని 1265 రూపాయలకు పెంచింది ప్రభుత్వం.
  • 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1400 నుంచి 1540 రూపాయలకు పెంపు.
  • ఇంటర్, ఆపై తరగతుల విద్యార్థులకు 1600 నుంచి 1760 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
  • పెంచిన ఛార్జీలు అక్టోబర్ 1, 2026 నుంచే అమల్లోకి వచ్చాయి.

వారానికి ఆరు రోజులు గుడ్లు

పెరిగిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా విద్యార్థులకు నూతన మెనూను ప్రభుత్వం ఖరారు చేసింది. వారంలో ఆరు రోజులు గుడ్లు.. మూడు రోజులు చికెన్.. ప్రతిరోజూ పాలు, పండ్లు అందించేలా మెనూను రూపొందించింది.

మెనూలో రకరకాల వంటకాలు

విద్యార్థులకు రుచికరమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందేలా మెనూలో పలు రకాల వంటకాలను చేర్చారు. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఎగ్ కర్రీతో పాటు పులిహోర, ఇడ్లీ, ఉప్మా, పొంగల్ వంటి అల్పాహార పదార్థాలు ఉన్నాయి. మల్టీ మిల్లెట్ చిక్కీలు, రాగి లడ్డూ, పండ్లు వంటి పోషకాహారాన్ని కూడా మెనూలో పొందుపరిచారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ఫోకస్

విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో డైట్ ఛార్జీలను పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఈ పెంచిన డైట్ ఛార్జీలు అమలు కానున్నాయి.

BC విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం

డైట్ ఛార్జీల పెంపుతో బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించే అవకాశం ఏర్పడిందని మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. విద్యతో పాటు విద్యార్థుల ఆహారం, ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు.

Follow Us
పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన బాపూజీ పంచ సూత్రాలు
పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన బాపూజీ పంచ సూత్రాలు
ఆర్టీసీ, మెట్రో సర్వీసులకు కామన్ పాస్.. హైదరాబాద్ వాసులకు ఊరట..
ఆర్టీసీ, మెట్రో సర్వీసులకు కామన్ పాస్.. హైదరాబాద్ వాసులకు ఊరట..
బిగ్‌బాస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. బయటకు వెళ్లేది ఆ ఇద్దరేనా?
బిగ్‌బాస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. బయటకు వెళ్లేది ఆ ఇద్దరేనా?
డీమార్ట్‌లో బ్యాగ్ కోసం డబ్బులు కట్టక్కర్లేదు.. ఈ ఒక్క రూల్..
డీమార్ట్‌లో బ్యాగ్ కోసం డబ్బులు కట్టక్కర్లేదు.. ఈ ఒక్క రూల్..
మీతో మాట్లాడుతున్న వ్యక్తి నిజమే చెబుతున్నాడా? ఇవి గమనించండి
మీతో మాట్లాడుతున్న వ్యక్తి నిజమే చెబుతున్నాడా? ఇవి గమనించండి
పండుగల సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే..
పండుగల సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే..
మఘ నక్షత్రంలోకి కేతువు.. ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలట!
మఘ నక్షత్రంలోకి కేతువు.. ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలట!
వచ్చే నెల రోజుల్లోనే DSC 2.0 నోటిఫికేషన్.. AP సర్కార్ కీలక ప్రకటన
వచ్చే నెల రోజుల్లోనే DSC 2.0 నోటిఫికేషన్.. AP సర్కార్ కీలక ప్రకటన
'సిగ్మా'పై నెగెటివ్ ప్రచారం.. వెనుక ఎవరున్నారో నాకు తెలుసు
'సిగ్మా'పై నెగెటివ్ ప్రచారం.. వెనుక ఎవరున్నారో నాకు తెలుసు
టీచర్లకు కీలక ప్రకటన.. తెలంగాణ TET నోటిఫికేషన్‌ విడుదల!
టీచర్లకు కీలక ప్రకటన.. తెలంగాణ TET నోటిఫికేషన్‌ విడుదల!