విదేశీ యువతులతో వల.. హైదరాబాద్‌లో హైటెక్ దందా..! కథ మామూలుగా లేదుగా..
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హోటల్‌పై పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. విదేశీ మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ముగ్గురు వ్యక్తులతో పాటు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకుని, ఈ వ్యవహారం వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ గచ్చిబౌలిలో హోటల్ కేంద్రంగా సాగుతున్న హైటెక్ వ్యభిచార వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. విదేశీ మహిళలను నగరానికి తీసుకొచ్చి హోటల్‌లో వేర్వేరు గదులు ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు సంయుక్తంగా డ్రీమ్ ప్రైడ్ హోటల్‌పై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఢిల్లీకి చెందిన నిఖిల్, రామ్మోహన్‌రెడ్డితో పాటు హర్షిత్ సింఘానియాను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు హోటల్‌లో ఉన్న ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో నిఖిల్ ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించినట్లు గుర్తించగా, అతడికి రామ్మోహన్‌రెడ్డి సహకరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
దాడుల సందర్భంగా హోటల్‌లో సోదాలు నిర్వహించిన పోలీసులు రూ.13 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహన్‌రెడ్డి వద్ద ఉన్న రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేసి, వాటిలోని సమాచారాన్ని పరిశీలిస్తున్నారు. పోలీసుల విచారణలో పట్టుబడిన ముగ్గురు మహిళలు కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్‌కు వచ్చినట్లు వెల్లడైనట్లు సమాచారం. వారి పాస్‌పోర్టులు, వీసాలను పరిశీలించగా అవి చెల్లుబాటులో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
అయితే, హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత వారు ఎవరిని సంప్రదించారు.. హోటల్‌లో గదులు ఎవరు ఏర్పాటు చేశారు.. విదేశీ మహిళలను ఈ వ్యవహారంలోకి ఎవరు తీసుకొచ్చారు..? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా విటులను సంప్రదించి హోటల్‌కు రప్పించారా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలోని కాల్ వివరాలు, సందేశాలు, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలించడం ద్వారా ఈ వ్యవహారం వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉంది..? ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయాలను గచ్చిబౌలి పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
