టీచర్లకు కీలక ప్రకటన.. తెలంగాణ TET నోటిఫికేషన్ 2026 విడుదల! అక్టోబర్ 7 నుంచే దరఖాస్తులు
రాష్ట్ర తెలంగాణలో ఇన్-సర్వీస్ టీచర్ల కోసం విద్యాశాఖ ప్రత్యేక టెట్ (TET) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుంచి అక్టోబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబర్ 16 నుంచి 21 వరకు ప్రత్యేక టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది..

హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణలోని ఇన్-సర్వీస్ టీచర్లకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా రెండో టెట్ (TET) నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన ఇన్-సర్వీస్ టీచర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ సూచించింది. ప్రత్యేక టెట్‌కు అక్టోబర్ 7, 2026 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అర్హత ఉన్న ఉపాధ్యాయులు అక్టోబర్ 16, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను విద్యాశాఖ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
తెలంగాణలోని ఇన్-సర్వీస్ టీచర్ల టెట్ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నవంబర్ 16 నుంచి టెట్ పరీక్షలు
ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించే ప్రత్యేక టెట్ పరీక్షలు నవంబర్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 21 వరకు వివిధ తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన షెడ్యూల్, ఇతర మార్గదర్శకాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. ఉపాధ్యాయుల అర్హతలకు సంబంధించిన నిబంధనల్లో భాగంగా ప్రత్యేక టెట్‌ను నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అర్హత కలిగిన ఇన్-సర్వీస్ టీచర్లు గడువులోగా దరఖాస్తు చేసుకుని పరీక్షకు సిద్ధం కావాలని సూచించింది.
ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబర్ 7, 2026 నుంచి
- దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 16, 2026 వరకు
- ప్రత్యేక టెట్ పరీక్షలు: నవంబర్ 16 నుంచి 21 వరకు
తెలంగాణలోని ఇన్-సర్వీస్ టీచర్ల టెట్ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




