AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: హోంవర్క్ చేయలేదని మందలింపు.. టీచర్ ముందే కుప్పకూలిన యూకేజీ చిన్నారి!

విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌లో యూకేజీ విద్యార్థి ప్రణయ్ హోంవర్క్ చేయలేదని టీచర్ చెంపదెబ్బ కొట్టడంతో క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రుల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగి టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలపై హింసను ఖండిస్తూ, ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Watch: హోంవర్క్ చేయలేదని మందలింపు.. టీచర్ ముందే కుప్పకూలిన యూకేజీ చిన్నారి!
Little Garden School
Balaraju Goud
|

Updated on: Aug 20, 2026 | 4:32 PM

Share

విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చిన్నారి కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టౌన్ కొత్త రోడ్‌లో ఉన్న లిటిల్ గార్డెన్ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. యూకేజీ చదువుతున్న ప్రణయ్‌ను హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాలుడు క్లాస్ రూమ్ లోనే కుప్పకూలిపోయాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

హోంవర్క్ పూర్తి చేయని విద్యార్థులను ఉపాధ్యాయురాలు ప్రశ్నించిన సమయంలో ప్రణయ్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో చిన్నారిని భయపెట్టేందుకు టీచర్ అతని చొక్కా బటన్స్ విప్పి బెదిరించే ప్రయత్నం చేసింది. భయాందోళనకు గురైన ప్రణయ్ ఏడుస్తుండగా ఉపాధ్యాయురాలు చెంపపై కొట్టింది. దీంతో ఒక్కసారిగా బాలుడు టీచర్ ఒళ్లోనే కుప్పకూలిపోయాడు. టీచర్ మందలించడంతోనే బాలుడి ప్రాణాల మీదకు వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఆ ఘటన జరిగిన కొద్దిసేపటికే ప్రణయ్ టీచర్ ముందే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. చిన్నారిపై టీచర్ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఘటనపై సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పాఠశాలలోని సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. పోలీసుల దర్యాప్తు అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us