AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: లండన్ వీధుల్లో విరాట్-అనుష్క సందడి.. కొడుకును స్కూల్‌లో దింపేందుకు వెళ్తుండగా కెమెరాకు చిక్కిన జంట

Watch: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జంట లండన్ వీధుల్లో సందడి చేస్తూ కనిపించారు. తమ కుమారుడు అకాయ్‌ను డే నర్సరీకి తీసుకెళ్తున్న సమయంలో తీసిన కొన్ని ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పిల్లల ప్రైవసీ కోసం లండన్ వెళ్లిన ఈ జంటను అక్కడ కూడా కెమెరాలు నీడలా వెన్నాడుతున్నాయి.

Watch: లండన్ వీధుల్లో విరాట్-అనుష్క సందడి.. కొడుకును స్కూల్‌లో దింపేందుకు వెళ్తుండగా కెమెరాకు చిక్కిన జంట
Virat Kohli (1)
Rakesh
|

Updated on: Sep 09, 2026 | 11:03 AM

Share

Watch: క్రికెట్ గ్రౌండ్స్‎లో నిరంతరం బిజీగా ఉండే విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆట నుంచి దొరికిన బ్రేక్ సమయాన్ని తన కుటుంబంతో కలిసి ఆస్వాదిస్తున్నాడు. లండన్ వీధుల్లో విరాట్, అనుష్క జంటగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విరాట్ ఆకుపచ్చ రంగు స్వెట్‌షర్ట్ ధరించగా, అనుష్క శర్మ క్యాజువల్ జాకెట్, లెగ్గింగ్స్, టోపీతో చాలా సింపుల్‎గా కనిపించారు. తమ కొడుకు అకాయ్‌ను స్కూల్ లేదా డే నర్సరీకి దింపేందుకు వీరు బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. విరాట్ ఒక మహిళతో మాట్లాడుతుండగా పక్కనే బేబీ స్ట్రోలర్ ఉంది. అయితే ఈ ఫోటోలలో అకాయ్ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

భారతదేశంలో ఉన్న విపరీతమైన క్రేజ్, ఫోటోగ్రాఫర్ల తాకిడి నుంచి తమ పిల్లలు వామిక, అకాయ్‌లను దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే వీరు లండన్‌ను తమ నివాసంగా ఎంచుకున్నారు. పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాకుండా విరుష్క జంట ఎంతో జాగ్రత్త పడుతుంటుంది. అక్కడ సాధారణ పౌరుల్లా జీవించాలని భావించినప్పటికీ, అభిమానుల కెమెరా కన్ను నుంచి వీరు తప్పించుకోలేకపోతున్నారు. ఒక పిక్‌లో అనుష్క శర్మ కెమెరా వైపు అసహనంగా చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. లండన్ ప్రయాణాల నడుమ వీరు తరచూ ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేస్తున్నారు. ఇటీవల బృందావనంలో ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని, కేంఛీ ధామ్‌లోని వేప కరోలీ బాబా ఆశ్రమాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించి వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, మళ్లీ ఆటకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో కోహ్లీ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. మరోవైపు అనుష్క శర్మ సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది. భారత మహిళా క్రికెట్ దిగ్గజం జులన్ గోస్వామి బయోపిక్‌గా తెరకెక్కిన చక్దా ఎక్స్‌ప్రెస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us