AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుపతిలో లవ్ జిహాద్ కలకలం.. పెళ్లికి మత మార్పిడి ఒత్తిడి.. MBBS విద్యార్థి అరెస్ట్!

తిరుపతిలో MBBS విద్యార్థి మహమ్మద్ రయీద్ ఖాద్రీ అరెస్ట్ అయ్యాడు. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి, పెళ్లి చేసుకోవాలంటే మతం మారాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మత మార్పిడికి ఒప్పుకోకుంటే వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని హైదరాబాద్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

తిరుపతిలో లవ్ జిహాద్ కలకలం.. పెళ్లికి మత మార్పిడి ఒత్తిడి.. MBBS విద్యార్థి అరెస్ట్!
Tirupati Love Jihad Case
Raju M P R
| Edited By: |

Updated on: Oct 03, 2026 | 10:37 AM

Share

తిరుపతి జిల్లాలో యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి చేసుకోవాలంటే మతం మారాలని ఒత్తిడి చేసిన ఎంబీబీఎస్‌ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి అక్కారంపల్లికి చెందిన యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ రయీద్‌ ఖాద్రీని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి జార్జియాలో ఎంబీబీఎస్‌ చదువుతోంది. అదే సమయంలో సహచర విద్యార్థి అయిన మహమ్మద్‌ రయీద్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత నెలలో రయీద్‌ తిరుపతికి వచ్చి ఓ హోటల్‌లో వారం రోజుల పాటు బస చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో యువతిని కలుసుకున్నట్లు వెల్లడించారు.

తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా.. పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాలని రయీద్‌ ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఇందుకు అంగీకరించకపోతే తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించినట్లు యువతి పోలీసులకు తెలిపింది. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు అలిపిరి పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ ఆదేశాలతో హైదరాబాద్‌లో ఉన్న నిందితుడి ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మలక్‌పేటలోని అక్బర్‌బాగ్‌లో రయీద్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

నిందితుడి నుంచి మొబైల్‌ ఫోన్‌తో పాటు కేసుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో లభించిన డిజిటల్‌ ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రివేంజ్ గేమ్‌కు రెడీ.. మరోసారి తలపడనున్న భారత్ vs పాకిస్థాన్
రివేంజ్ గేమ్‌కు రెడీ.. మరోసారి తలపడనున్న భారత్ vs పాకిస్థాన్
ట్యూబ్ టైర్ vs ట్యూబ్‌లెస్ టైర్: మీ వాహనానికి ఏది బెటర్‌? తేడాలు
ట్యూబ్ టైర్ vs ట్యూబ్‌లెస్ టైర్: మీ వాహనానికి ఏది బెటర్‌? తేడాలు
కళ్యాణ్ రామ్ భార్య గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
కళ్యాణ్ రామ్ భార్య గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే ఛూమంత్రం..
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే ఛూమంత్రం..
డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. అలర్ట్..
డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. అలర్ట్..
ఫోన్ రిపేర్ కోసం మహిళ.. ఫొటోలపై కన్నేశాడు! అమెరికాలో అరెస్ట్
ఫోన్ రిపేర్ కోసం మహిళ.. ఫొటోలపై కన్నేశాడు! అమెరికాలో అరెస్ట్
క్రమశిక్షణతోనే విజయం.. చదువుపై ఏకాగ్రత పెరగాలంటే ఈ 4 చేయండి
క్రమశిక్షణతోనే విజయం.. చదువుపై ఏకాగ్రత పెరగాలంటే ఈ 4 చేయండి
చలికాలంలో నోటికి కమ్మదనాన్ని ఇచ్చే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం.
చలికాలంలో నోటికి కమ్మదనాన్ని ఇచ్చే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం.
ఓటమిని గెలుపుగా మార్చుకోవాలి.. బంగారు రెక్కల హంస కథ!
ఓటమిని గెలుపుగా మార్చుకోవాలి.. బంగారు రెక్కల హంస కథ!
ఇంటి పనులకు వచ్చిన జేసీబీ డ్రైవర్‌తో ప్రేమలోపడ్డ యువతి,కట్‌చేస్తే
ఇంటి పనులకు వచ్చిన జేసీబీ డ్రైవర్‌తో ప్రేమలోపడ్డ యువతి,కట్‌చేస్తే