నభా నటేష్ మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది. కన్నడ , తెలుగు చిత్రాలలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ..
2019 లో నటించిన ఇస్మార్ట్ శంకర్ విజయవంతమైనది. ఈ సినిమాతో ఈ చిన్నది మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో తన అందంతో నటనతో ఆకట్టుకుంది.
1995 డిసెంబర్ 11 కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూరు జిల్లా శృంగేరిలో జన్మించింది. ఈ అమ్మడు మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది.
కన్నడ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 2015 లో శివ రాజ్‌కుమార్‌తో కలిసి కన్నడ మూవీ వజ్రకాయలో నభ నటేష్ అరంగేట్రం చేసింది.
అంతే కాదు ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013 లో టాప్ 10 లో నభా కనిపించింది. తెలుగులో నభా ఫస్ట్ మూవీ నన్ను దోచుకుందువటే
ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. మధ్యలో యాక్సిడెంట్ కారణంగా కొన్నేళ్లు సినిమాలకు దూరం అయ్యింది.
ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే సోషల్ మీడియాలోనూ ఫొటోలతో ఆకట్టుకుంటుంది.