AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వల వేసేముందు నక్కతోక తొక్కాడో ఏమో.. ఏంది గురూ ఈ చేపలు..

శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో చేపల వేటకు వెళ్లిన జోగులాంబ గద్వాల జిల్లా షేక్‌పల్లి గ్రామానికి చెందిన జాలరి వినోద్ కృష్ణకు ఊహించని అదృష్టం కలిసొచ్చింది. వల వేయగా ఏకంగా ఐదు భారీ బొచ్చ చేపలు చిక్కాయి. ఒక్కో చేప సుమారు 30 కిలోల బరువు ఉన్నట్లు తోటి మత్స్యకారులు చెబుతున్నారు.

వల వేసేముందు నక్కతోక తొక్కాడో ఏమో.. ఏంది గురూ ఈ చేపలు..
Giant Fish Catch
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Sep 09, 2026 | 10:45 AM

Share

శ్రీశైలం బ్యాక్ వాటర్ లో వేటకు వెళ్లిన ఓ జాలరికి అదృష్టం తలుపుతట్టింది. సాధారణంగా దొరికే చేపల స్థానంలో ఏకంగా భారీ బొచ్చ చేపలు వలకు చిక్కడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం షేక్ పల్లి గ్రామానికి చెందిన జాలరి వినోద్ కృష్ణ రెండు రోజుల క్రితం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో చేపల వేటకు వెళ్లాడు. ఎప్పటిలాగే వల విసరగా కొద్దిసేపటికే బరువెక్కింది. దీంతో వలలో పెద్ద మొత్తంలో చేపలు చిక్కినట్లు భావించాడు. తీరా వలను బయటకు తీసి చూడగా ఒకటి కాదు… రెండు కాదు ఏకంగా ఐదు భారీ బొచ్చ చేపలు కనిపించాయి.

ఒక్కో చేప సుమారు 30కిలోల బరువు ఉన్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో వినోద్ కృష్ణ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంత పెద్ద బొచ్చ చేపలు వలకు చిక్కడం అరుదని, అలాంటిది ఒకేసారి ఐదు చేపలు దొరకడం నిజంగా అదృష్టమేనని తోటి జాలర్లు చెబుతున్నారు. భారీ చేపలు దొరకడంతో సంతోషంలో ఉన్న వినోద్ కు మరో గుడ్ న్యూస్ ఎదురైంది. ఈ బొచ్చ చేపలకు మార్కెట్‌లో మంచి ధర పలకడంతో ఒకే వేటలో భారీగా ఆదాయం వచ్చే అవకాశం లభించింది. దీంతో వినోద్ కృష్ణకు నిజంగానే పంట పండినట్టైంది.

వీడియో చూడండి..

శ్రీశైలం బ్యాక్ వాటర్ లో వలకు చిక్కిన ఈ భారీ బొచ్చ చేపల విషయం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. పెద్ద చేపలను చూసేందుకు స్థానికులు, తోటి జాలర్లు ఆసక్తి చూపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలో కొత్త పింఛన్లపై మరో అప్డేట్.. అప్లై చేసుకునేముందు..
ఏపీలో కొత్త పింఛన్లపై మరో అప్డేట్.. అప్లై చేసుకునేముందు..
టీ20ల్లో 9 ఏళ్లుగా చెక్కుచెదరని రోహిత్ శర్మ రికార్డు
టీ20ల్లో 9 ఏళ్లుగా చెక్కుచెదరని రోహిత్ శర్మ రికార్డు
ఇవి రెండు పూటలు తింటే ఎముకలకు 10 రెట్లు బలం పెరుగుతుంది
ఇవి రెండు పూటలు తింటే ఎముకలకు 10 రెట్లు బలం పెరుగుతుంది
ఏం సినిమా రా బాబూ.. ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న మూవీ..
ఏం సినిమా రా బాబూ.. ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న మూవీ..
వలకు చిక్కిన బాహుబలి చేపలు.. జాలరికి ఊహించని జాక్ పాట్..
వలకు చిక్కిన బాహుబలి చేపలు.. జాలరికి ఊహించని జాక్ పాట్..
రూ. 20 వేల పులస చేప.. చిరంజీవికి కానుకగా పంపిన అభిమాని!
రూ. 20 వేల పులస చేప.. చిరంజీవికి కానుకగా పంపిన అభిమాని!
మాస శివరాత్రి.. ఈరోజు పూజకు అత్యంత శుభ సమయం ఇదే! సకల శుభాలు..
మాస శివరాత్రి.. ఈరోజు పూజకు అత్యంత శుభ సమయం ఇదే! సకల శుభాలు..
కలలో పాము కనిపించిందా? శుభమా.. అశుభమా? ఈ 6 సంకేతాల అర్థం తెలుసా?
కలలో పాము కనిపించిందా? శుభమా.. అశుభమా? ఈ 6 సంకేతాల అర్థం తెలుసా?
బిగ్ బాష్ లీగ్ ప్రైవేటీకరణకు ఆస్ట్రేలియా బోర్డు ఆమోదం
బిగ్ బాష్ లీగ్ ప్రైవేటీకరణకు ఆస్ట్రేలియా బోర్డు ఆమోదం
మూడో రోజు పక్కా యాక్షన్ ప్లాన్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్.
మూడో రోజు పక్కా యాక్షన్ ప్లాన్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్.