AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్ వచ్చేసింది.. ఇక నో టెన్షన్..

యూఐడీఏఐ ఆధార్ కార్డు వినియోగదారులకు శుభవార్త అందించింది. కొత్త ఆథార్ ఫేస్ ఆధెంటికేషన్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా ఆధార్ కేవైసీ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఫేస్ వెరిఫికేషన్ కోసం ఇతర యాప్‌లను ఓపెన్ చేయడాన్ని ఇది తగ్గిస్తుంది.

Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్ వచ్చేసింది.. ఇక నో టెన్షన్..
Aadhaar Card
Venkatrao Lella
|

Updated on: Sep 27, 2026 | 7:43 PM

Share

ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆధార్ కేవైసీ ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది. ఈ మేరకు కొత్త ఫీచర్లను యూఐడీఏఐ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఆధార్ ఫేస్ వెరిఫికేషన్ పూర్తి చేయాలంటే ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ లేదా ఇతర యాప్‌లోకి మారాల్సి వచ్చేది. ఇప్పటినుంచి ఆ పని తప్పుతుంది. ఆధార్ ఫేస్ ఆర్డీ లేదా ఇతర యాప్‌లు తెరవాల్సిన పని లేదు. సులువుగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం, కేవైసీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు యూఐడీఏఐ కొత్త ఫేస్ అథెంటికేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఆధార్ ఫేస్ అధెంటికేషన్ ఎస్‌డీకే, ఆధార్ ఫేస్ ఆధెంటికేషన్ శాండ్ బాక్స్ టూల్స్‌ను విడుదల చేసింది. ఈ టూల్స్ ద్వారా కేవైసీ ప్రక్రియ బ్యాంకింగ్, ఇన్యూరెన్స్ ఫ్లాట్‌ఫామ్స్, ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లో సులువు కానుంది.

ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ఇన్యూరెన్స్ పాలసీ తీసుకోవాలన్నా, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలన్నా కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆధార్ ఫేస్ అధెంటికేషన్ ప్రక్రియ తప్పనిసరి. ఇప్పటివరకు బ్యాంకింగ్, ఇన్యూరెన్స్, ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లో ఫేస్ అధెంటికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ డౌన్ లోడ్ చేయాల్సి వచ్చింది. దీని వల్ల కేవైసీ ప్రక్రియ అనేది ఆలస్యమయ్యేది. ఇక నుంచి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ యాప్స్‌లోనే ఆధార్ ఫేస్ ఆధెంటికేషన్ ఫీచర్ ఉంటుంది. దీంతో వేరే యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఆయా యాప్స్‌‌లో పూర్తి చేయవచ్చు. దీని వల్ల సింగిల్ యాప్‌లోనే సులువుగా కేవైసీ ప్రక్రియ అనేది ముగుస్తుంది. ఈ కొత్త ఫీచర్ వల్ల డిజిటల్ కేవైసీ, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల రిజిస్ట్రేషన్ వేగవంతమవుతుంది.

ఇక ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ శాండ్ బాక్స్ సేవలు ద్వారా బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఇతర ఆర్ధిక సంస్థలు తమ కస్టమర్లకు సేవలు అందించడానికి ముందు ఈ టూల్ ద్వారా ఫీచర్లను పరీక్షించవచ్చు. ఫేష్ క్యాప్చర్, యూజర్ అనుమతి, వెరిఫికేషన్ వంటివి టెస్ట్ చేయవచ్చు. ఇక ఎస్డీకే టూల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారిత లైవ్ నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నకిలీ ఫొటోలు, వీడియో మోసాలను ఇవి అరికడతాయి. ఇక సురక్షితంగా డేటా నిర్వహించేందుకు ఎన్‌క్రిప్షన్ సపోర్ట్ కూడా ఈ టూల్‌లో ఉంది. యూఐడీఏఐ తీసుకొచ్చిన ఈ టూల్స్ కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయడం, మోసాలను అరికట్టేందుకు ఉపయోగపడనున్నాయి.

Follow Us
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి