కర్నూల్-గుంతకల్ రైలు మార్గంలో డోన్ సమీపంలో ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను లోకో పైలట్ సమ్మయ్య చాకచక్యంగా గుర్తించి రైలును నిలిపివేశారు. మతిస్థిమితం లేని ఆ మహిళ ప్రాణాలను కాపాడి, ప్రయాణికుల సాయంతో ఆమెను పక్కకు తప్పించి పోలీసులకు అప్పగించారు. ఈ సాహసోపేత చర్యకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.