AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: హాఫ్ ఫిట్ ఆటగాళ్లతో బరిలోకి.. పరువు కోసం ఇలా దిగజారాలా గంభీర్..?

Half Fit Players India Squad: మ్యాచ్‌లలో గెలుపోటములు సహజం, కానీ పరువు కాపాడుకోవడం కోసం ఆటగాళ్ల శారీరక సామర్థ్యాన్ని పణంగా పెట్టడం ఏమాత్రం సమర్థనీయం కాదు. గౌతమ్ గంభీర్ మేనేజ్‌మెంట్ ఇప్పటికైనా ఈ తప్పులను ఒప్పుకుని, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోతే భవిష్యత్తులో మరిన్ని ఘోర పరాజయాలను చవిచూడాల్సి వస్తుంది.

Team India: హాఫ్ ఫిట్ ఆటగాళ్లతో బరిలోకి.. పరువు కోసం ఇలా దిగజారాలా గంభీర్..?
Half Fit Players India Squad
Venkata Chari
|

Updated on: Jul 12, 2026 | 2:30 PM

Share

Team India: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ మేనేజ్‌మెంట్ సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలలో ఎదురైన ఘోర పరాజయాల తర్వాత, జట్టు పరువు కాపాడుకోవడానికి పూర్తి ఫిట్‌నెస్ లేని ఆటగాళ్లను బలవంతంగా మైదానంలోకి దించుతున్నారనే సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యూహాత్మక తప్పులు ఆటగాళ్ల కెరీర్‌ను ప్రమాదంలో పడేస్తున్నాయని విమర్శకులు మండిపడుతున్నారు.

పరువు కోసం పాకులాట.. ఆటగాళ్ల ప్రాణాలతో చెలగాటం?

ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 4-0తో వైట్‌వాష్‌కు గురై, నంబర్ వన్ ర్యాంకును కూడా కోల్పోయిన తర్వాత మేనేజ్‌మెంట్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆఖరి మ్యాచ్‌లలో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే తాపత్రయంలో గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బంది క్రీడా నియమాలను తుంగలో తొక్కినట్లు తెలుస్తోంది. గాయాల నుంచి పూర్తిగా కోలుకోని, సగం ఫిట్‌నెస్‌తో ఉన్న కొందరు కీలక ఆటగాళ్లను బలవంతంగా బరిలోకి దించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ నిర్ణయం జట్టు విజయాన్ని అందించకపోగా, ఆటగాళ్ల గాయాలు మరింత తీవ్రం కావడానికి కారణమైంది.

ఇది కూడా చదవండి: Team India: బద్దలైన 1605 రోజుల రికార్డ్.. టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే చీకటి రోజు..!

ఇవి కూడా చదవండి

వరుస గాయాల వెనుక అసలు రహస్యం ఇదేనా?

ఈ పర్యటనలోనే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాలు మోకాలి నరాల (హామ్‌స్ట్రింగ్) గాయాల బారిన పడి సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. వీరిద్దరి నిష్క్రమణ వెనుక మేనేజ్‌మెంట్ ఒత్తిడి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. నెట్ ప్రాక్టీస్ సమయంలోనే నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు వారు ఫిర్యాదు చేసినప్పటికీ, మ్యాచ్ ఫలితం కోసం వారిని ఆడించడమే ఈ భారీ నష్టానికి దారితీసిందని అంతర్గత వర్గాల సమాచారం. పూర్తి ఫిట్‌నెస్ లేకపోవడం వల్లే మైదానంలో భారత బౌలర్లు, ఫీల్డర్లు పసికూనల్లా దారుణంగా విఫలమయ్యారని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘నా పేరిట చెత్త రికార్డ్.. ప్రపంచంలో కెప్టెన్ జీరో నేనే’..: శ్రేయస్ అయ్యర్

సెలెక్టర్ల అసంతృప్తి.. గంభీర్ మార్కు ప్రయోగాలపై విమర్శలు

ఈ పర్యటనలో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ల కోసం హర్షిత్ రాణాను బ్యాటింగ్ ఆర్డర్ మార్చి పంపడం, 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లలో ఆడించి వెంటనే పక్కన పెట్టడం వంటి నిర్ణయాలు ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. వీటికి తోడు ఇప్పుడు ‘హాఫ్-ఫిట్’ ఆటగాళ్ల వివాదం తోడవడంతో బీసీసీఐ పెద్దలు కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. రాబోయే జింబాబ్వే పర్యట, ఆసియా క్రీడలకు ముందు ఇలాంటి వివాదాలు రేగడం టీమిండియా ప్రతిష్టను దెబ్బతీస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us