AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ‘2028 వరల్డ్ కప్ వరకు కెప్టెన్‌గా నేనే ‘.. శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు..?

Shreyas Iyer India Captaincy 2028 World Cup: వరుస ఓటముల తర్వాత కెప్టెన్సీ మార్పుపై వస్తున్న వార్తలకు శ్రేయస్ అయ్యర్ తన వ్యాఖ్యల ద్వారా బ్రేక్ వేసే ప్రయత్నం చేశాడు. అయితే, బీసీసీఐ అంత సులభంగా ఈ ఘోర పరాజయాలను వదిలిపెట్టేలా లేదు. రాబోయే జింబాబ్వే పర్యటనలోనైనా అయ్యర్ సేన బలమైన ప్రదర్శనతో పుంజుకుంటేనే అతని 2028 ప్రపంచ కప్ కల నిజమవుతుంది.

Team India: '2028 వరల్డ్ కప్ వరకు కెప్టెన్‌గా నేనే '.. శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు..?
Shreyas Iyer India Captaincy 2028 World Cup
Venkata Chari
|

Updated on: Jul 12, 2026 | 1:54 PM

Share

Shreyas Iyer India Captaincy 2028 World Cup: ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా ఎదుర్కొన్న ఘోర పరాభవం తర్వాత భారత క్రికెట్‌లో సరికొత్త దుమారం రేగింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-0తో వైట్‌వాష్‌కు గురైనప్పటికీ, భారత సరికొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏమాత్రం తగ్గడం లేదు. రాబోయే 2028 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ వరకు తానే భారత జట్టుకు నాయకుడిగా ఉంటానని బహిరంగంగా ప్రకటించి బీసీసీఐ పెద్దలకు గట్టి సవాల్ విసిరాడు.

సిరీస్ ఓడినా తగ్గని కెప్టెన్.. మేనేజ్‌మెంట్‌పై నమ్మకం..!

సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లోనూ 56 పరుగుల తేడాతో ఓడిపోయిన అనంతరం శ్రేయస్ అయ్యర్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లలో ఘోరంగా వైట్‌వాష్ అవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో అయ్యర్ తన భవిష్యత్తు ప్రణాళికలను స్పష్టం చేశాడు. “ప్రస్తుతం జట్టు పరివర్తన (ట్రాన్సిషన్) దశలో ఉంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు నన్ను సుదీర్ఘ కాలం కోసం ఎంపిక చేశారు. కాబట్టి 2028 లో జరిగే టీ20 ప్రపంచ కప్ చక్రం పూర్తయ్యే వరకు నేనే జట్టును నడిపిస్తాననే నమ్మకం నాకుంది” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇది కూడా చదవండి: Team India: బద్దలైన 1605 రోజుల రికార్డ్.. టీమిండియా క్రికెట్ హిస్టరీలోనే చీకటి రోజు..!

ఇవి కూడా చదవండి

సూర్యకుమార్ స్థానంలో వచ్చిన శ్రేయస్..

ఇటీవలే అహ్మదాబాద్ వేదికగా ముగిసిన 2026 టీ20 ప్రపంచ కప్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత సూర్యకుమార్ ఫామ్ కోల్పోవడంతో, బీసీసీఐ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శ్రేయస్ అయ్యర్‌ను కొత్త ట్వంటీ-20 కెప్టెన్‌గా ప్రకటించింది. గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్ సైతం అయ్యర్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది. దీనికి తోడు సీనియర్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను కాదని యువ ఆటగాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించడం ద్వారా 2028 ప్రపంచ కప్ కోసం సరికొత్త రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు.

టాస్ భాగ్యమే తప్ప.. విజయాలు శూన్యం..!

శ్రేయస్ అయ్యర్ ఆత్మవిశ్వాసం బాగానే ఉన్నా, అతని నాయకత్వంలో జట్టు నమోదు చేస్తున్న ఫలితాలు మాత్రం అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ పర్యటనలో అయ్యర్ వరుసగా 7 టాస్‌లు గెలిచి దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేసినప్పటికీ, ఆ అదృష్టాన్ని విజయాలుగా మార్చడంలో ఘోరంగా విఫలమయ్యాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోవడమే కాకుండా, సుదీర్ఘ కాలంగా భారత్ కైవసం చేసుకున్న నంబర్ వన్ టీ20 ర్యాంకును కూడా ఇంగ్లాండ్ చేతిలో కోల్పోవాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: ‘నా పేరిట చెత్త రికార్డ్.. ప్రపంచంలో కెప్టెన్ జీరో నేనే’..: శ్రేయస్ అయ్యర్

యువ ఆటగాళ్ల ప్రయోగాలే కొంపముంచాయా?

ఈ పర్యటనలో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని అరంగేట్రం చేయించడం, ఆ తర్వాత చివరి మ్యాచ్‌లో అతనిపై వేటు వేసి సంజూ శాంసన్‌ను తీసుకురావడం వంటి ప్రయోగాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. అలాగే మిడిలార్డర్‌లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం హర్షిత్ రాణా, శివమ్ దూబేల బ్యాటింగ్ స్థానాలను మార్చడం జట్టులో గందరగోళాన్ని సృష్టించింది. ఈ లోపాలన్నింటినీ పక్కనపెట్టి శ్రేయస్ అయ్యర్ నేరుగా 2028 వరల్డ్ కప్ కెప్టెన్సీని డిమాండ్ చేయడం ఇప్పుడు బీసీసీఐ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
'నేనే 2028 వరల్డ్ కప్ వరకు కెప్టెన్‌గా ఉంటా'..: శ్రేయస్ అయ్యర్
'నేనే 2028 వరల్డ్ కప్ వరకు కెప్టెన్‌గా ఉంటా'..: శ్రేయస్ అయ్యర్
ఆ సమస్యలతో బాధపడుతున్నా.. అందుకే ఇలా కనిపిస్తున్నా: రష్మీ గౌతమ్
ఆ సమస్యలతో బాధపడుతున్నా.. అందుకే ఇలా కనిపిస్తున్నా: రష్మీ గౌతమ్
చిన్న సినిమా అనుకున్నారు.. కట్ చేస్తే
చిన్న సినిమా అనుకున్నారు.. కట్ చేస్తే
18 నెలలలోపు చిన్న పిల్లలకు అద్దం చూపిస్తే.. మాటలు రావా?
18 నెలలలోపు చిన్న పిల్లలకు అద్దం చూపిస్తే.. మాటలు రావా?
తోటకూర తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఆయుర్వేదం చెప్పే..
తోటకూర తింటే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఆయుర్వేదం చెప్పే..
ఇలాంటి మోసాలను మీరెప్పుడైనా చూశారా..? మీరు కూడా బాధితులు కావచ్చు!
ఇలాంటి మోసాలను మీరెప్పుడైనా చూశారా..? మీరు కూడా బాధితులు కావచ్చు!
కోహ్లీ రికార్డ్ బ్రేక్.. బట్లర్ నెక్ట్స్ టార్గెట్ రోహిత్..
కోహ్లీ రికార్డ్ బ్రేక్.. బట్లర్ నెక్ట్స్ టార్గెట్ రోహిత్..
కేవలం 2-3 గంటల్లోనే పాలు తోడుకోవాలంటే ఇలా చేయండి..
కేవలం 2-3 గంటల్లోనే పాలు తోడుకోవాలంటే ఇలా చేయండి..
మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు బలహీనంగా మారుతున్నాయా? అలసత్వం వద్దు
మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు బలహీనంగా మారుతున్నాయా? అలసత్వం వద్దు
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..