బన్నీ ‘బుట్ట బొమ్మ సాంగ్’కి అదిరిపోయే స్టెప్పులేసిన వార్నర్ దంపతులు
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజైన్ ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. అందులోనూ ఈ చిత్రంలోని అన్ని పాటలూ ఓ రేంజ్‌లో..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజైన్ ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. అందులోనూ ఈ చిత్రంలోని అన్ని పాటలూ ఓ రేంజ్‌లో పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమానికి తమన్ సంగీతమందించాడు. మూవీ విడుదలకు ముందే ఈ పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా సామజవరగమన, బుట్టబొమ్మ, రాములో రాములో.. పాటలు సినిమాకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. బుట్టబొమ్మ సాంగ్‌కి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శిల్పా శెట్టి, దిశా పటాని తదితరులు ఫిదా అయి టిక్‌టాక్‌లో డ్యాన్స్ చేశారు.
ఇప్పుడు ఈ పాటలు టాలీవుడ్, బాలీవుడ్‌నే కాదు ఇంటర్నేషనల్‌గా బాగా ఫేమస్ అయ్యాయి. అదీ ఎంతలా అంటే.. ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సైతం తన వైఫ్‌తో బుట్ట ‘బొమ్మ సాంగ్’కి డ్యాన్స్ చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్నీ ధరించిన వార్నర్ తన భార్యతో కలిసి ఈ పాటకు టిక్‌టాక్ చేశాడు. వెనకాల తన కూతురు అటూ ఇటూ తిరుగుతూ హల్‌చల్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
View this post on InstagramIt’s tiktok time #buttabomma get out of your comfort zone people lol @candywarner1
Read More:
వెహికల్ ట్యాక్స్‌పై స్వల్ప ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం
మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి
జర్నలిస్ట్‌కి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌కు నలుగురు మంత్రులు