Breaking: భారత ఫుట్‌బాల్ లెజండ్ గోస్వామి కన్నుమూత..!
భారత ఫుట్‌బాల్ లెజండ్ చునీ గోస్వామి(82) కన్నమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కార్డియాక్ అరెస్ట్‌తో గురువారం సాయంత్రం కోల్‌కతాలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1957లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. 1962లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత ఫుట్‌బాల్ టీమ్‌కు గోస్వామి సారధ్యం వహించారు. అప్పుడు భారత టీమ్ బంగారు పతాకాన్ని కైవసం చేసుకుంది. అలాగే 1964 ఏషియన్ గేమ్స్‌లోనూ సారధ్యం వహించగా.. భారత్ టీమ్ రన్నరప్‌గా నిలిచింది. […]

భారత ఫుట్‌బాల్ లెజండ్ చునీ గోస్వామి(82) కన్నమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కార్డియాక్ అరెస్ట్‌తో గురువారం సాయంత్రం కోల్‌కతాలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1957లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. 1962లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత ఫుట్‌బాల్ టీమ్‌కు గోస్వామి సారధ్యం వహించారు. అప్పుడు భారత టీమ్ బంగారు పతాకాన్ని కైవసం చేసుకుంది. అలాగే 1964 ఏషియన్ గేమ్స్‌లోనూ సారధ్యం వహించగా.. భారత్ టీమ్ రన్నరప్‌గా నిలిచింది.
కాగా గోస్వామి ఫుట్‌బాల్ ప్లేయర్ మాత్రమే కాదు మంచి క్రికెటర్ కూడా. 1966లో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో గేరీ సాబర్స్ టీమ్(వెస్టిండీస్)ను ఓడించడంలో గోస్వామి కీలక పాత్ర వహించారు. ఆ మ్యాచ్‌లో ఆయన 8 వికెట్లను తీశారు. ఇక 1971-72 బెంగాల్ రంజీ టీమ్‌కు ఆయన సారధ్యం వహించారు. ఆ మ్యాచ్ ఫైనల్‌లో బెంగాల్ జట్టు ముంబయి చేతిలో ఓడిపోయింది. మరోవైపు ఆయన మరణంపై బీసీసీఐ కూడా సంతాపం ప్రకటించింది.
Read This Story Also: Coronavirus: ‘సామాజిక దూరం’ కోసం అందుబాటులోకి కొత్త యాప్..!
BCCI mourns the death of Subimal ‘Chuni’ Goswami, an all-rounder in the truest sense. He captained the Indian national football team & led to them to gold in the 1962 Asian Games. He later played first-class cricket for Bengal & guided them to the final of Ranji Trophy in 1971-72 pic.twitter.com/WgXhpoyLaB
— BCCI (@BCCI) April 30, 2020