Coronavirus: ‘సామాజిక దూరం’ కోసం అందుబాటులోకి కొత్త యాప్..!
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు సామాజిక దూరమే ఉత్తమమైన మార్గమని అందరూ చెబుతున్నారు. అందుకే కనీసం 1.5 మీటర్ల దూరం పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు సామాజిక దూరమే ఉత్తమమైన మార్గమని అందరూ చెబుతున్నారు. అందుకే కనీసం 1.5 మీటర్ల దూరం పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా 1.5 మీటర్ల దూరంను మనం కరెక్ట్‌గా పాటిస్తున్నామా..? లేదా..? అన్నది తెలుసుకోవడం కాస్త కష్టమే. దీన్ని తెలుసుకోవడం కోసం అమెరికాలోని యునైటెడ్ నేషన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ల్యాబ్(UNTIL) ఓ కొత్త యాప్‌ను రూపొందించింది. 1point5 పేరుతో రూపొందిన ఈ యాప్ ఇంచుమించు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు అనే యాప్‌లాగే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు యాపిల్ ఫోన్లలోనూ ఇది అందుబాటులో ఉంది. దీన్ని వాడాలంటే కచ్చితంగా బ్లూటూత్, జీపీఎస్ ఆన్‌తో ఉండాలి.
యాప్ ఎలా పనిచేయనుందంటే.. ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్‌లోకి వెళ్లి 1point5ను ఇన్‌స్టాల్ నుంచి చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే గెట్ స్టార్టెడ్ అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే.. చుట్టుపక్కల ఎన్ని మీటర్ల దూరంలోకి ఇతరులు వస్తే హెచ్చరించాలో మనమే నిర్ణయించుకోవచ్చు. ఎంపిక పూర్తయ్యాక బ్లూటూత్ ఎనేబుల్ చేయాలి. ఆ తరువాత జీపీఎస్ లొకేషన్ యాక్సెస్‌కు అనుమతించి, యాప్‌ను వాడుకోవచ్చు. అయితే మన దగ్గరున్న వారు కూడా బ్లూటూత్ ఆన్ చేసి ఉంటేనే ఈ యాప్ పనిచేయనుంది.
కాగా ఈ యాప్ యూజర్ల నుంచి ఎలాంటి సమాచారం సేకరించదని UNTIL తెలిపింది. అలాగే ఆరోగ్య సేతు లాగే ఈ యాప్ ఎలాంటి ఆరోగ్య సమాచారం ఇవ్వదని.. కేవలం భౌతిక దూరం పాటించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఆ సంస్థ తెలిపింది.
Read This Story Also: అప్పుడు కరోనా కంటే ఆ మరణాలే ఎక్కువవుతాయి: ‘ఇన్ఫీ’ నారాయణ మూర్తి