సానియా మీర్జా అరుదైన ఘనత..
కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. అయితే.. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా గురువారం అరుదైన ఘనత సాధించింది. ఆసియా/ఓషియానియా జోన్ నుంచి ఫెడ్ కప్ హార్ట్

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించాయి. అయితే.. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా గురువారం అరుదైన ఘనత సాధించింది. ఆసియా/ఓషియానియా జోన్ నుంచి ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు నామినేట్ అయిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కింది. ఆమెతోపాటు ఇండోనేషియాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ ప్రిస్కా మెడెలిన్ నుగ్రోరో కూడా నామినేట్ అయింది. సానియా ఇటీవల నాలుగేళ్ల తర్వాత ఫెడ్ కప్‌లోకి తిరిగి వచ్చింది. తన 18 నెలల కుమారుడు ఇజాన్‌ను స్టాండ్స్‌లో ఉంచి ఆడి తొలిసారి ప్లే-ఆఫ్స్‌కు భారత్ అర్హత సాధించేందుకు సాయం చేసింది.
మరోవైపు.. “2003లో తొలిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ కోర్టులో ఆడుగుపెట్టడం నాకు గర్వకారణం. ఇది 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. భారత టెన్నిస్‌లో విజయాలకు దోహదపడినందుకు గర్వంగా ఉంది’’ అని ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్‌లో పేర్కొంది. “గత నెలలో జరిగిన ఆసియా/ఓషియానియా టోర్నమెంట్‌లో ఫెడ్ కప్ ఫలితం నా క్రీడా జీవితంలోని గొప్ప విజయాల్లో ఒకటి. ఫెడ్‌కప్ హార్ట్ అవార్డ్స్ సెలక్షన్ ప్యానల్ నన్ను గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’’ అని 33 ఏళ్ల సానియా పేర్కొంది.
వివరాల్లోకెళితే.. హార్ట్ అవార్డుల విజేతలను అభిమానులు ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. ఇది మే 1 నుంచి 8 వరకు కొనసాగుతుంది. ఫెడ్ కప్ హార్ట్ అవార్డుల 11వ ఎడిషన్ కోసం ఈ ఏడాది అనెట్ కోంటావిట్ (ఎస్టోనియా), ఎలినోరా మోలినారో (లగ్జంబర్గ్)లు యూరప్/ఆఫ్రికా జోన్ నుంచి నామినేట్ కాగా, మెక్సికోకు చెందిన ఫెర్నాండా కాంట్రెరాస్ గోమెజ్, పరాగ్వేకు చెందిన వెరోనికా సెపెడ్ రాయ్గ్‌లు అమెరికా నుంచి నామినేట్ అయ్యారు.