వన్డే, టీ20లలో నెంబర్ వన్ ఆటగాడు రోహిత్ః గంభీర్
భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇవాళ తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ట్విటర్ వేదికగా రోహిత్ శర్మను ప్రశంసలతో ముంచెత్తాడు. వన్డే, టీ20లలో నెంబర్ వన్ ఆటగాడు రోహితేనంటూ పొగడ్తలు కురిపించాడు. ఎప్పుడూ అడుతున్నట్లే.. రాబోయే ఏడాది కూడా మరింత అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. రోహిత్‌తో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన గంభీర్ ‘వరల్డ్ బెస్ట్ వైట్ బాల్ క్రికెటర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. […]

భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇవాళ తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ట్విటర్ వేదికగా రోహిత్ శర్మను ప్రశంసలతో ముంచెత్తాడు. వన్డే, టీ20లలో నెంబర్ వన్ ఆటగాడు రోహితేనంటూ పొగడ్తలు కురిపించాడు. ఎప్పుడూ అడుతున్నట్లే.. రాబోయే ఏడాది కూడా మరింత అద్భుతంగా ఆడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. రోహిత్‌తో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన గంభీర్ ‘వరల్డ్ బెస్ట్ వైట్ బాల్ క్రికెటర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. రాబోయే ఏడాది మరింత గొప్పగా ఆడాలి’ అంటూ వివరించాడు. కాగా, రోహిత్‌కు పలువురు క్రికెటర్లు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండటంతో రోహిత్ శర్మ తన కూతురుతో ఇంట్లో సరదాగా గడుపుతున్నాడు.
Read Also:
ఇక నుంచి విమానాల్లోనూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్.!
తెరపైకి మరో కొత్త పేరు.. కిమ్ వారసుడు ఆయనేనట.!
లాక్ డౌన్ బేఖాతర్.. గుంపులుగా సామూహిక ప్రార్ధనలు..
మే 3 తర్వాత లాక్ డౌన్ 3.0 ఖాయమేనా.?
కరోనా మాటున పాకిస్తాన్ భారీ కుట్ర.. భారత సైన్యానికి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు..
కరోనా కాలంలో జగన్ ప్రభుత్వం మరో సంచలనం..
Happy Birthday to the best white ball cricketer in the world @ImRo45! Have a great year ahead!! pic.twitter.com/PJqDTVcohy
— Gautam Gambhir (@GautamGambhir) April 30, 2020