కరోనా కాలంలో జగన్ ప్రభుత్వం మరో సంచలనం..

కరోనా కాలంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌–19 కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తిరిగి పట్టాలకెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎంఎస్‌ఎంఈలతో పాటుగా కీలక రంగాలన్నింటిని ఆదుకునేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. మొదటిగా ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు గానూ.. 2014–15 నుంచి పెండింగులో ఉన్న బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. దీని […]

కరోనా కాలంలో జగన్ ప్రభుత్వం మరో సంచలనం..
Follow us

|

Updated on: Apr 30, 2020 | 8:22 PM

కరోనా కాలంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌–19 కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తిరిగి పట్టాలకెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎంఎస్‌ఎంఈలతో పాటుగా కీలక రంగాలన్నింటిని ఆదుకునేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు.

మొదటిగా ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు గానూ.. 2014–15 నుంచి పెండింగులో ఉన్న బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. దీని కోసం ప్రత్యేకంగా ఆర్ధిక రక్షణ ప్రణాళికను సిద్దం చేసింది. మొత్తంగా రూ. 905 కోట్ల చెల్లింపులకు.. అలాగే మే నెలలో సగం, జూన్‌ నెలలో సగం చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఏప్రిల్, మే, జూన్‌ నెలల కాలానికి ఎంస్‌ఎంఈలకు పవర్‌ డిమాండ్‌ ఛార్జీలు రూ. 188 కోట్లను మాఫీ చేయనున్నారు. మరోవైపు తక్కువ వడ్డీకి రూ.200 కోట్ల రూపాయల వర్కింగ్‌ కేపిటల్‌ను అందించనున్నారు. అటు మిగిలిన పరిశ్రమలకు కూడా మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్‌)కరెంటు మినిమం డిమాండ్‌ ఛార్జీలను వాయిదా వేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు వెలువడిన తర్వాత టెక్ట్స్‌టైల్‌ సహా ఇతర పరిశ్రమలను ఆదుకోవడానికి కావాల్సిన చర్యలు చేపడతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

Read Also:

ఇక నుంచి విమానాల్లోనూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్.!

తెరపైకి మరో కొత్త పేరు.. కిమ్ వారసుడు ఆయనేనట.!

లాక్ డౌన్ బేఖాతర్.. గుంపులుగా సామూహిక ప్రార్ధనలు..

మే 3 తర్వాత లాక్ డౌన్ 3.0 ఖాయమేనా.?

కరోనా మాటున పాకిస్తాన్ భారీ కుట్ర.. భారత సైన్యానికి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు..