ఛీ, ఛీ.. సిగ్గు లేదా.. ఎంతకు దిగజారిపోయారురా.. పంతం కోసం 11వ ర్యాంక్ జట్టుతో బరిలోకి పాక్ టీం
ట్రై సిరీస్ షెడ్యూల్‌లో భాగంగా, ఆతిథ్య పాకిస్తాన్ తమ మొదటి మ్యాచ్‌ను జింబాబ్వేతో నవంబర్ 17న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. అన్ని జట్లు రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఆడతాయి, ఆ తర్వాత టాప్ రెండు జట్లు నవంబర్ 29న లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఫైనల్‌లో తలపడతాయి.

నవంబర్ 17 నుంచి 29 వరకు పాకిస్తాన్‌లో జరగాల్సి ఉన్న T20I ట్రై-నేషన్ సిరీస్‌కి ఆతిథ్య దేశం పాకిస్తాన్, శ్రీలంకతో పాటు మొదట ఆఫ్ఘనిస్తాన్ కూడా భాగం కావాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక విషాదకరమైన సంఘటన ఉంది. పాకిస్తాన్ తమ సరిహద్దుల్లో చేసిన వైమానిక దాడుల్లో తమ ముగ్గురు యువ క్రికెటర్లు (కబీర్, సిబ్‌ఘతుల్లా, హరూన్) మరణించారని ACB ఆరోపించింది. ఈ దురదృష్టకర సంఘటనకు నిరసనగా, మరణించిన క్రికెటర్లకు గౌరవ సూచకంగా ఈ సిరీస్ నుంచి వైదొలగుతున్నట్లు ACB ప్రకటించింది.
ఈ ఘటనను ICC (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్), BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి) కూడా తీవ్రంగా ఖండించాయి.
జింబాబ్వేతో సిరీస్ ప్లాన్ చేసిన పాకిస్తాన్..
ఆఫ్ఘనిస్తాన్ ఆకస్మికంగా వైదొలగడంతో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) వెంటనే ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఫలితంగా, జింబాబ్వే క్రికెట్ బోర్డు తమ ఆహ్వానాన్ని అంగీకరించింది. ఈ మేరకు శ్రీలంక, పాకిస్తాన్, జింబాబ్వే జట్లు ఈ ట్రై సిరీస్‌లో ఆడతాయని PCB ధృవీకరించింది.
ట్రై సిరీస్ షెడ్యూల్‌లో భాగంగా, ఆతిథ్య పాకిస్తాన్ తమ మొదటి మ్యాచ్‌ను జింబాబ్వేతో నవంబర్ 17న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో ఆడనుంది. అన్ని జట్లు రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఆడతాయి, ఆ తర్వాత టాప్ రెండు జట్లు నవంబర్ 29న లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఫైనల్‌లో తలపడతాయి.
దిగజారిన పాక్ జట్టు..
అఫ్గానిస్తాన్ జట్టు తప్పుకోవడంతో అష్టకష్టాలు పడిన పాకిస్తాన్ జట్టు.. ఎట్టి పరిస్థితుల్లోనైనా ట్రై సిరీస్ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం పలు దేశాలతో సంప్రదింపులు చేసింది. ఈ క్రమంలో నేపాల్, యూఏఈ క్రికెట్ బోర్డులతో కూడా పాక్ సంప్రదింపులు జరిపాయి. అయితే, లిస్ట్‌లోకి జింబాబ్వే ఎంట్రీ ఇచ్చింది. ఎట్టకేలకు జింబాబ్వే ఓకే చెప్పడంతో పాక్ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








