Yuzvendra Chahal: కావాల్సింది ప్రేమ.. అది కాదు..’: ధనశ్రీ పోస్ట్ తర్వాత చాహల్ రిక్వెస్ట్

Yuzvendra Chahal - Dhanashree: యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోయారనే వార్తలు గత కొన్ని రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ప్రబలంగా వినిపిస్తున్నాయి. వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయగా, చాహల్ ధనశ్రీ ఫొటోలను కూడా తొలగించారు. ఇది విడాకుల ఊహాగానాలకు దారితీసింది.

Yuzvendra Chahal: కావాల్సింది ప్రేమ.. అది కాదు..': ధనశ్రీ పోస్ట్ తర్వాత చాహల్ రిక్వెస్ట్
Yuzvendra Chahal Dhanashree
Follow us
Venkata Chari

|

Updated on: Jan 10, 2025 | 10:33 AM

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య సంబంధానికి సంబంధించి ఊహాగానాలు, పుకార్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వీరి జోడీ విడాకులు తీసుకోనుందని మీడియా నుంచి సోషల్ మీడియా వరకు నిత్యం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఒక విభాగం చాహల్‌ను ట్రోల్ చేస్తోంది. అయితే, చాలా మంది వినియోగదారులు ధనశ్రీని టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇద్దరూ ఇంకా ఏమీ మాట్లాడలేదు. కానీ, ట్రోలింగ్‌కు సంబంధించి ప్రకటనలు జారీ చేశారు. తన ప్రతిష్టను పాడు చేయడంపై ధనశ్రీ అసంతృప్తి వ్యక్తం చేయగా, ఒక రోజు తర్వాత చాహల్ కూడా ఒక ప్రకటన విడుదల చేశాడు. తన వ్యక్తిగత జీవితం గురించి ఎటువంటి ఊహాగానాలు చేయవద్దని విజ్ఞప్తి చేశాడు.

ఊహాగానాలు నిజం కావచ్చు లేదా కాకపోవచ్చు..

టీమిండియాకు దూరంగా ఉన్న లెగ్ స్పిన్నర్ చాహల్ జనవరి 9 గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ప్రకటనను విడుదల చేశాడు. తన అభిమానుల ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలిపాడు. తన ప్రయాణం ఇంకా ముగియలేదని, ఎందుకంటే “నా దేశం, నా జట్టు, నా అభిమానుల కోసం నేను ఇంకా చాలా గొప్పగా ఆడాలి” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత, చాహల్ తన వ్యక్తిగత జీవితంపై వస్తోన్న వార్తలు, పుకార్లను ప్రస్తావించాడు. చాహల్ ఇన్‌స్టాలో, “నేను ఆటగాడిగా గర్వపడుతున్నాను. అదే సమయంలో నేను కొడుకు, సోదరుడు, స్నేహితుడిని కూడా. ఇటీవలి పరిణామాలు, ముఖ్యంగా నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వాటి గురించిన ఉత్సుకతను నేను అర్థం చేసుకున్నాను. కానీ, నేను కొన్ని సమస్యలపై సోషల్ మీడియా పోస్ట్‌లను కూడా చూశాను. అందులో ఊహాగానాలు జరుగుతున్నాయి. అవి నిజం కావచ్చు లేదా కాకపోవచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

హార్డ్ వర్క్, షార్ట్ కట్స్ కాదు, సానుభూతి కాదు.. ప్రేమ కావాలి..

చాహల్ తన విడాకులను ధృవీకరించనప్పటికీ, అతని ప్రకటన ఖచ్చితంగా దాని వాస్తవాన్ని సూచిస్తుంది. ఎందుకంటే చాహల్ తన స్టేట్‌మెంట్‌లో రెండుసార్లు తనను కొడుకు, సోదరుడు, స్నేహితుడిగా అభివర్ణించాడు. కానీ, అతను తనొక భర్త అని ఎక్కడా పేర్కొనలేదు. “నాకు, నా కుటుంబానికి చాలా బాధ కలిగిస్తున్నందున అలాంటి ఊహాగానాలలో మునిగిపోవద్దని నేను ప్రతి ఒక్కరినీ వినమ్రంగా కోరుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక్కడితో ఆగకుండా తన కష్టాన్ని ప్రస్తావించి షార్ట్ కట్స్ తీసుకోనని చెప్పుకొచ్చాడు. “నేను ఎల్లప్పుడూ నా కుటుంబం నుంచి నేర్చుకున్న విలువలు ప్రతి ఒక్కరి గురించి మంచిగా ఆలోచించడం, పూర్తి నిబద్ధత, కృషితో విజయం సాధించడానికి ముందుకు సాగడం, షార్ట్ కట్స్ తీసుకోకుండా నేను ఇప్పటికీ ఈ విలువలకు కట్టుబడి ఉన్నాను. భగవంతుని ఆశీర్వాదంతో, నేను ఎల్లప్పుడూ మీ ప్రేమ, మద్దతు పొందడానికి ప్రయత్నిస్తాను. సానుభూతి కాదంటూ” చెప్పుకొచ్చాడు.

ధనశ్రీ ఏం చెప్పింది?

చాహల్ ప్రకటనకు 24 గంటల ముందు, ధనశ్రీ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమె కూడా తన గురించి మాత్రమే మాట్లాడింది. చాహల్‌తో తనకున్న సంబంధాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. నిరాధారమైన వార్తలు, ద్వేషంతో తన ప్రతిష్ట మసకబారుతుందని ధనశ్రీ రాసుకొచ్చింది. ఎప్పుడూ కష్టపడి, అంకితభావంతో తాను ఈ స్థానానికి చేరాను. తన మౌనాన్ని బలహీనతగా భావించవద్దని ధనశ్రీ సూచించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..