WTC 2025: ఆసీస్‌పై విజయంతో డబ్ల్యూటీసీ పట్టికలో మార్పులు.. ఫైనల్ చేరేందుకు భారత్ ఇంకెన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

బోర్డర్ గవాస్కర్ టెస్టులో భారత్ బోణీ కొట్టింది. సమష్ఠి ప్రదర్శనతో పెర్త్‌ టెస్టులో అద్భుత విజయం సాధించింది. కంగారూలను సొంతగడ్డపై భారత్ 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

WTC 2025: ఆసీస్‌పై విజయంతో డబ్ల్యూటీసీ పట్టికలో మార్పులు.. ఫైనల్ చేరేందుకు భారత్ ఇంకెన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
Team India
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2024 | 3:31 PM

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ 150 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత క్రీడాభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అయితే జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో బౌలర్లు సత్తా చాటారు. ఆస్ట్రేలియా 104 పరుగులకే పరిమితం చేసి టీమిండియాను మళ్లీ పోటీలోకి తెచ్చారు. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్‌ల భారీ భాగస్వామ్యం కారణంగా ఇతర బ్యాటర్లలోనూ నైతిక స్థైర్యం పెరిగింది.. వీరిద్దరూ తొలి వికెట్‌కు 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ తో మెరిశాడు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలిపి ఆసీస్ కు 533 పరుగుల భారీ టార్గెట్ ను విధించింది. అయితే రెండో ఇన్నింగ్స్ లోనూ ఆసీస్ బ్యాటర్లు తడబడ్డారు. భారత బౌలర్ల ధాటికి కేవలం 238 పరుగులకే కుప్పకూలింది. దీంతో 295 పరుగుల తేడాతో పెర్త్ టెస్ట్ ను భారత్ వశం చేసుకుంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 101 బంతుల్లో 89 పరుగులు చేసి భారత విజయాన్ని కాస్త ఆలస్యం చేశాడు. హెడ్ ఔటైన తర్వాత భారత్ విజయం సులువైంది. కాగా ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ మరోసారి అగ్రస్థానానికి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

భారత్‌కు ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉండగా వాటిలో మూడింటిలో గెలిస్తే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. భారత్ ఇప్పటి వరకు మొత్తం 15 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 9 గెలిచింది. ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. భారత్ గెలుపు శాతం 61.11. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచి ఉంటే ఇప్పటికే భారత్ ఫైనల్ బెర్తు ఖరారయ్యేది. ఇక ఇప్పటి వరకు 13 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా 8 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియా విజేత శాతం 57.69 . ప్రస్తుతం ఆ జట్టు రెండవ స్థానంలో ఉంది.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక ఇదే..

శ్రీలంక జట్టు ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడగా 5 మ్యాచ్‌లు గెలిచి 4 మ్యాచ్‌లు ఓడింది. 55.56 విజయాల శాతంతో ఆ జట్టు మూడవ స్థానంలో ఉంది. ఇక న్యూజిలాండ్ జట్టు 11 టెస్టు మ్యాచ్‌లు ఆడి 6 మ్యాచ్‌లు గెలిచి 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు గెలుపు శాతం 54.55 గా ఉంది. ఇక దక్షిణాఫ్రికా జట్టు 8 మ్యాచ్‌లు ఆడి 4 మ్యాచ్‌లు గెలిచి 3 మ్యాచ్‌లు ఓడి 1 మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. విజయాల శాతం 54.17 గా ఉంది. ఇక ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ జట్లు ఇప్పటికే ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాయి.

భారత జట్టుకు జైషా అభినందనలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..