AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Mega Auction 2025 Highlights: ముగిసిన ఐపీఎల్ వేలం.. భారీ ధర అతడికే?

IPL Auction 2025 Live Updates in Telugu: మెగా వేలం మొదటి రోజు, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ముఖ్యాంశాల్లో నిలిచారు. మొత్తం 84 మంది ఆటగాళ్లను వేలం వేయగా, అందులో 12 మంది మాత్రమే మిగిలారు. వీరిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు.

IPL Mega Auction 2025 Highlights: ముగిసిన ఐపీఎల్ వేలం.. భారీ ధర అతడికే?
Ipl Auction 2025 Live Update
Venkata Chari
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Nov 25, 2024 | 10:49 PM

Share

IPL Auction 2025 Live Updates in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో నేడు రెండో రోజు. ఈరోజు అన్ని జట్లకు సంబంధించిన ప్లేయర్ల జాబితా బయటకు రానుంది. రెండు రోజుల పాటు జరిగిన వేలంలో తొలి రోజు భారత క్రికెటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌, వెంకటేష్ అయ్యర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఢిల్లీకి రిషబ్ కెప్టెన్‌గా ఉన్నాడు. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శ్రేయాస్ గతసారి ఛాంపియన్‌గా నిలిపాడు. ఇద్దరూ వేలానికి వెళ్లారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్రికెటర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. లక్నో అతన్ని రూ. 27 కోట్లకు తీసుకుంది. శ్రేయస్ ధర 26.75 కోట్లకు పెరిగింది. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్రాంచైజీ లీగ్‌లో ఆడేందుకు 1574 మంది క్రికెటర్లు నమోదు చేసుకున్నారు. తుది జాబితాలో 574 మందికి చోటు దక్కింది. చివరి నిమిషంలో ముగ్గురిని చేర్చారు. తొలిరోజు వేలానికి 84 మంది హాజరయ్యారు. అయితే, డేవిడ్ వార్నర్ అమ్ముడుపోకపోవడం గమనార్హం.

నేడు రెండవ రోజు కూడా మరిన్ని షాకింగ్ న్యూస్‌లు రావొచ్చు. ముఖ్యంగా ఇంగ్లండ్ పేసర్ జిమ్మీ అండర్సన్ వైపు అందరి చూపు నెలకొంది. ఐపీఎల్‌లో తొలిసారిగా పేరు తెచ్చుకున్నాడు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Nov 2024 08:30 PM (IST)

    వైభవ్ సూర్యవంశీకి రూ. 1.10 కోట్లు

    యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ కోసం ఫ్రాంచైజీలు భారీగా పోటీ పడ్డాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లతో దక్కించుకుంది.
  • 25 Nov 2024 08:00 PM (IST)

    ఏ జట్టు వద్ద ఎంత పర్స్ ఉందంటే?

    CSK – రూ. 3.30 కోట్లు

    MI – రూ. 2.15 కోట్లు

    RCB – రూ. 4.65 కోట్లు

    KKR – రూ. 5.00 కోట్లు

    SRH – రూ. 1.70 కోట్లు

    RR – రూ. 3.50 కోట్లు

    PBKS – రూ. 1.75 కోట్లు

    DC – రూ. 2.25 కోట్లు

    GT – రూ. 3.95 కోట్లు

    LSG – రూ. 1.75 కోట్లు

  • 25 Nov 2024 07:33 PM (IST)

    ప్రియాంష్ ఆర్యకు రూ. 3.80 కోట్లు

    ప్రియాంష్ ఆర్య కోసం అన్ని జట్లు పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ కింగ్స్ రూ. 3.80 కోట్లతో దక్కించుకుంది.
  • 25 Nov 2024 06:51 PM (IST)

    ఉనద్కత్‌కు కోటి

    జయదేవ్ ఉనద్కత్‌ను మరోసారి హైదరాబాద్ జట్టు దక్కించుకుంది. ఈ ప్లేయర్ రూ. 1 కోటి దక్కించుకున్నాడు.
  • 25 Nov 2024 06:48 PM (IST)

    ఆర్‌సీబీలోకి మరో పేసర్

    నువాన్ తుషారకు జాక్ పాట్ తగిలింది. ఐపీఎల్ మెగా వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 1.60 కోట్లకు దక్కించుకుంది.
  • 25 Nov 2024 06:37 PM (IST)

    గుజరాత్ వద్దే సాయి కిషోర్..

    ఆర్.సాయి కిషోర్ మరోసారి గుజరాత్ టైటాన్స్‌తోనే ఆడనున్నాడు. ఇందుకోసం ఫ్రాంచైజీ రూ. 2 కోట్లు అందించింది.
  • 25 Nov 2024 06:31 PM (IST)

    ముంబై చేరిన విల్ జాక్స్

    విల్ జాక్స్ ఐపీఎల్ మెగా వేలంలో రూ. 5.25 కోట్లు దక్కించుకున్నాడు. ముంబై ఇండియన్స్ టీం భారీగా బిడ్డింగ్ వేసి ఈ ఆటగాడిని దక్కించుకుంది.
  • 25 Nov 2024 06:01 PM (IST)

    అన్షుల్ కాంబోజ్‌కు రూ.3 కోట్లుపైగానే

    యంగ్ ప్లేయర్ అన్షుల్ కాంబోజ్‌కు జాక్ పాట్ తగిలింది. ఈ ప్లేయర్ కోసం చాలా జట్లు పోటీపడ్డాయి. చివరకు చెన్నై రూ. 3.40 కోట్లు ఖర్చు చేసింది.
  • 25 Nov 2024 05:06 PM (IST)

    ఏ జట్టు వద్ద ఎంతుందంటే?

    CSK – రూ. 13.20 కోట్లు

    MI – రూ. 11.05 కోట్లు

    RCB – రూ. 14.15 కోట్లు

    KKR – రూ. 8.55 కోట్లు

    SRH – రూ. 5.15 కోట్లు

    RR – రూ. 6.65 కోట్లు

    PBKS – రూ. 10.90 కోట్లు

    DC – రూ. 3.80 కోట్లు

    GT – రూ. 11.90 కోట్లు

    LSG – రూ. 6.85 కోట్లు

  • 25 Nov 2024 05:05 PM (IST)

    సెట్ 16, 17 వేలం తర్వాత సోల్డ్/అన్‌సోల్డ్ ప్లేయర్‌లు

    తుషార్ దేశ్‌పాండే – రూ. 6.50 కోట్లు (RR)

    గెరాల్డ్ కోయెట్జీ – రూ. 2.40 కోట్లు (GT)

    భువనేశ్వర్ కుమార్ – రూ. 10.75 కోట్లు (RCB)

    ముఖేష్ కుమార్ – రూ. 8 కోట్లు (DC)

    దీపక్ చాహర్ – రూ. 9.25 కోట్లు (MI)

    ఆకాష్ దీప్ – రూ. 8 కోట్లు (LSG)

    లాకీ ఫెర్గూసన్ – రూ. 2 కోట్లు (PBKS)

    ముజీబ్ ఉర్ రెహమాన్ – అన్‌సోల్డ్

    అల్లా గజన్‌ఫర్ – రూ. 4.80 కోట్లు (MI)

    విజయకాంత్ వియస్కాంత్ – అన్సోల్డ్

    అకేల్ హోసేన్ – అన్‌సోల్డ్

    ఆదిల్ రషీద్ – అన్‌సోల్డ్

    కేశవ్ మహారాజ్ – అన్‌సోల్డ్.

  • 25 Nov 2024 04:50 PM (IST)

    4 కోట్లకు పైగానే పట్టేసిన ఆఫ్ఘాన్ ప్లేయర్

    అల్లా గజన్‌ఫర్‌ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగానే పోటీ పడ్డాయి. చివరకు ముంబై జట్టు రూ. 4.80 కోట్లకు దక్కించుకుంది.
  • 25 Nov 2024 04:40 PM (IST)

    జాక్ పాట్ కొట్టిన దీపక్ చాహర్

    దీపక్ చాహర్ ఖాతాలో రూ. 9.25 కోట్లు చేరాయి. ఈ ప్లేయర్ కోసం పంజాబ్, ముంబై, చెన్నై టీంలు హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు ముంబై టీం సొంతం చేసుకుంది.
  • 25 Nov 2024 04:37 PM (IST)

    ఢిల్లీ తరపున ఆడనున్న ముఖేష్

    ముఖేష్ కుమార్ కోసం కూడా భారీగా బిడ్ వేశాయి ఫ్రాంచైజీలు. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 8 కోట్లకు దక్కించుకుంది.
  • 25 Nov 2024 04:27 PM (IST)

    బెంగళూరు చేరిన భువీ

    భువనేశ్వర్ కుమార్ కోసం మూడు జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. చివరకు ఆర్సీబీకి రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది.
  • 25 Nov 2024 04:22 PM (IST)

    రాజస్థాన్ జట్టుతో చేతులు కలిపిన తుషార్ పాండే

    తుషార్ దేశ్‌పాండే వచ్చే ఏడాది రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్నాడు. ఇందుకోసం ఆర్ ఆర్రూ . 6.50 కోట్లు ఖర్చు చేసింది.
  • 25 Nov 2024 04:15 PM (IST)

    సెట్ 15 వేలం తర్వాత మిగిలిన పర్సు

    CSK – రూ. 13.20 కోట్లు

    MI – రూ. 25.10 కోట్లు

    RCB – రూ. 24.90 కోట్లు

    KKR – రూ. 8.55 కోట్లు

    SRH – రూ. 5.15 కోట్లు

    RR – రూ. 13.15 కోట్లు

    PBKS – రూ. 12.90 కోట్లు

    DC – రూ. 11.80 కోట్లు

    GT – రూ. 14.30 కోట్లు

    LSG – రూ. 14.85 కోట్లు.

  • 25 Nov 2024 04:13 PM (IST)

    13, 14, 15 సెట్ల వేలం తర్వాత సోల్డ్/అన్‌సోల్డ్ ప్లేయర్లు

    కేన్ విలియమ్సన్ – అమ్ముడుపోలేదు

    గ్లెన్ ఫిలిప్స్ – అమ్ముడుపోలేదు

    రోవ్‌మన్ పావెల్ – రూ. 1.50 కోట్లు (KKR)

    అజింక్య రహానే – అమ్ముడుపోలేదు

    ఫాఫ్ డు ప్లెసిస్ – రూ. 2 కోట్లు (DC)

    మయాంక్ అగర్వాల్ – అమ్ముడుపోలేదు

    పృథ్వీ షా – అమ్ముడుపోలేదు

    శార్దూల్ ఠాకూర్ – అమ్ముడుపోలేదు

    వాషింగ్టన్ సుందర్ – రూ. 3.20 కోట్లు (GT)

    సామ్ కర్రాన్ – రూ 2.40 కోట్లు (CSK)

    మార్కో జాన్సెన్ – రూ. 7 కోట్లు (PBKS)

    డారిల్ మిచెల్ – అమ్ముడుపోలేదు

    నితీష్ రాణా – రూ. 4.20 కోట్లు (RR)

    షాయ్ హోప్ – అమ్ముడుపోలేదు

    ర్యాన్ రికెల్టన్ – రూ. 1 కోటి (MI)

    KS భరత్ – అమ్ముడుపోలేదు

    జోష్ ఇంగ్లీస్ – రూ. 2.60 కోట్లు (PBKS)

    అలెక్స్ కారీ – అమ్ముడుపోలేదు

    డోనోవన్ ఫెర్రేరియా – అమ్ముడుపోలేదు

  • 25 Nov 2024 04:08 PM (IST)

    పంజాబ్ చేరిన జోష్ ఇంగ్లిష్

    జోష్ ఇంగ్లిస్‌ వచ్చే ఏడాది పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. ఇందుకోసం పంజాజ్ రూ. 2.60 కోట్లు ఖర్చు చేసింది.
  • 25 Nov 2024 04:01 PM (IST)

    రాజస్థాన్ చేరిన నితీష్ రానా

    నితీష్ రానా వచ్చే ఏడాది రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడనున్నాడు. ఇందుకోసం రూ. 4.20 కోట్లు ఖర్చు చేసింది.
  • 25 Nov 2024 03:57 PM (IST)

    బెంగళూరు చేరిన కృనాల్ పాండ్యా

    కృనాల్ పాండ్యా కోసం హోరాహోరీ పోరు జరిగింది. చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 5.75 కోట్లు ఖర్చు చేసి, సొంతం చేసుకుంది.
  • 25 Nov 2024 03:51 PM (IST)

    పంజాబ్ చేరిన మార్కో జాన్సెన్

    మార్కో జాన్సెన్ వచ్చే ఏడాది పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. ఇందుకోసం రూ. 7 కోట్లు ఖర్చు చేసింది.
  • 25 Nov 2024 03:50 PM (IST)

    చెన్నై చేరిన సామ్ కర్రాన్

    సామ్ కుర్రాన్ వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. ఇందుకోసం చెన్నై రూ. 2.40 కోట్లు ఖర్చు చేసింది.
  • 25 Nov 2024 03:46 PM (IST)

    గుజరాత్ చేరిన సుందర్

    వాషింగ్టన్ సుందర్ వచ్చే ఏడాది గుజరాత్ టైటాన్స్ చెంతకు చేరాడు. ఇందుకోసం గుజరాత్ రూ. 3.20 కోట్లు ఖర్చు చేసింది.
  • 25 Nov 2024 03:43 PM (IST)

    ఢిల్లీకి మారిన ఫాఫ్ డు ప్లెసెస్

    ఫాఫ్ డు ప్లెసెస్ వచ్చే ఏడాది ఢిల్లీ క్యాపిటలర్స్ తరపున ఆడనున్నాడు. ఇందుకోసం డీసీ రూ. 2 కోట్లు ఖర్చు చేసింది.
  • 25 Nov 2024 03:41 PM (IST)

    పృథ్వీ షాకు బిగ్ షాక్

    యంగ్ ప్లేయర్ పృథ్వీ షాకు ఊహించని షాక్ తగిలింది. ఏ ఫ్రాంచైజీ కూడా కొనేందుకు ముందుకు రాలేదు.
  • 25 Nov 2024 03:40 PM (IST)

    మయాంక్ అగర్వాల్‌కు బిగ్ షాక్

    మయాంక్ అగర్వాల్‌ను కూడా కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.
  • 25 Nov 2024 03:38 PM (IST)

    అమ్ముడవ్వని అజింక్య రహానే

    అజింక్య రహాను కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ధోని మాజీ టీం ప్లేయర్‌కు బిగ్ షాక్ తగిలింది.

  • 25 Nov 2024 03:37 PM (IST)

    కేకేఆర్‌కు చేరిన రోవ్‌మన్ పావెల్

    రోవ్‌మన్ పావెల్‌ను తీసుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రూ. 1.50 కోట్లు వెచ్చించింది.
  • 25 Nov 2024 03:36 PM (IST)

    కేన్ మామ బాటలోనే గ్లెన్ ఫిలిప్స్

    గ్లెన్ ఫిలిప్స్‌ కూడా అమ్ముడవ్వలేదు. ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలాడు.
  • 25 Nov 2024 03:34 PM (IST)

    కేన్ మామకు నిరాశే

    కేన్ విలియమ్సన్ (బేస్ ధర రూ. 2 కోట్లు) ఐపీఎల్ మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మారాడు. ఏ ఫ్రాంచైజీ ఈ స్టార్ ప్లేయర్‌ను కొనేందుకు ఆసక్తి చూపలేదు.
  • 25 Nov 2024 03:25 PM (IST)

    2వ రోజు భారీ బిడ్‌లను పొందగల భారతీయులు?

    నితీష్ రాణా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, తుషార్ దేశ్ పాండే.
  • 25 Nov 2024 03:20 PM (IST)

    IPL 2025 వేలంలో 2వ రోజున పాల్గొనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు..

    అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, ఆష్టన్ టర్నర్, టిమ్ డేవిడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, స్టీవ్ స్మిత్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, మాట్ షార్ట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, నాథన్ ఎల్లిస్, ఝై కోపర్ బార్‌నోట్‌సన్ , విల్ సదర్లాండ్, డేనియల్ సామ్స్, రిలే మెరెడిత్, లాన్స్ మోరిస్, బెన్ ద్వార్షుయిస్, క్రిస్ గ్రీన్, జోష్ బ్రౌన్, ఒల్లీ డేవిస్, అష్టన్ అగర్, హిల్టన్ కార్ట్‌రైట్, మైఖేల్ నేసర్, ఆండ్రూ టై.
  • 25 Nov 2024 03:13 PM (IST)

    IPL 2025 వేలంలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన భారతీయులు

    1. రిషబ్ పంత్ నుండి లక్నో సూపర్ జెయింట్ రూ. 27 కోట్లు.

    2. పంజాబ్ కింగ్స్‌కు శ్రేయాస్ అయ్యర్ రూ. 26.75 కోట్లు.

    3. వెంకటేష్ అయ్యర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రూ. 23.75 కోట్లు.

    4. పంజాబ్ కింగ్స్‌కు అర్ష్‌దీప్ సింగ్ రూ. 18 కోట్లు.

    5. యుజ్వేంద్ర చాహల్ పంజాబ్ కింగ్స్‌కు రూ. 18 కోట్లు.

  • 25 Nov 2024 03:00 PM (IST)

    IPL Auction 2025 Live Updates: మరో 132 ఖాళీలు

    తొలిరోజు మొత్తం రూ.467.95 కోట్లు వెచ్చించి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. దీంతో మరో 132 స్లాట్‌లు పూరించాల్సి ఉంది. ఇందు కోసం మొత్తం 10 ఫ్రాంచైజీలు ఈరోజు బిడ్డింగ్‌లోకి రానున్నాయి.

Published On - Nov 25,2024 2:57 PM