AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: టీమిండియాకు బిగ్ షాక్.. టాప్ ప్లేస్ నుంచి దిగజారిన రోహిత్ సేన.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఔట్?

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. 19 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు వికెట్ నష్టపోకుండా ఛేదించింది. 5 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లోని మూడో మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరగనుంది.

WTC Final: టీమిండియాకు బిగ్ షాక్.. టాప్ ప్లేస్ నుంచి దిగజారిన రోహిత్ సేన.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఔట్?
Ind Vs Aus Wtc 2025 Points
Venkata Chari
|

Updated on: Dec 08, 2024 | 11:46 AM

Share

WTC Final: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. 19 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు వికెట్ నష్టపోకుండా ఛేదించింది. 5 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లోని మూడో మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరగనుంది.

ఈ ఓటమితో టీమిండియాకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ రూపంలో మరో దెబ్బ తగలింది. ఈ మ్యాచ్‌కు ముందు 110 పాయింట్లు, 61.11 శాతంతో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. అడిలైట్ ఓటమి తర్వాత ఏకంగా 3వ స్థానానికి పడిపోయింది. పాయింట్ల శాతం 57.29కి పడిపోవడంతో మూడవ స్థానంలోకి దిగజారింది. అడిలైట్ విజయంతో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానం చేరుకోగా.. 60.71 పాయంట్ల శాతంతో డబ్ల్యూటీసీ ఫైనల్ దిశగా అడుగులు వేసింది. ఇక టీమిండియాకు ఊహించని షాక్ ఇచ్చిన సౌతాఫ్రికా రెండో స్థానంలో ఎగబాకింది. 59.26 పాయింట్ల శాతంతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు దూసుకొస్తోంది.

భారత్ వర్సెస్ అస్ట్రేలియా రెండో టెస్ట్ తర్వాత WTC 2023-25 ​​పాయింట్ల పట్టిక..

ర్యాంక్ జట్టు టెస్ట్‌లు గెలుపు ఓటమి డ్రా పాయింట్లు PCT
1 ఆస్ట్రేలియా 14 9 4 1 102 60.71
2 దక్షిణాఫ్రికా 9 5 3 1 64 59.26
3 భారతదేశం 16 9 6 1 110 57.29
4 శ్రీలంక 10 5 5 0 60 50.00
5 ఇంగ్లండ్ 21 11 9 1 114 45.24
6 న్యూజిలాండ్ 13 6 7 0 69 44.23
7 పాకిస్తాన్ 10 4 6 0 40 33.33
8 బంగ్లాదేశ్ 12 4 8 0 45 31.25
9 వెస్టిండీస్ 11 2 7 2 32 24.24

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి