WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ వేలానికి రంగం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?
Women’s Premier League (WPL) 2026: మహిళల ప్రీమియర్ లీగ్ కోసం మెగా వేలం ఢిల్లీలో జరగనుంది. 194 మంది భారతీయులతో సహా మొత్తం 277 మంది ప్లేయర్లు ఈ వేలంలో పాల్గొంటారు. ఐదు జట్లు గతంలో తమ 16 మంది ఆటగాళ్లను నిలుపుకున్నాయి.

Women’s Premier League (WPL) 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ( WPL) 2026 వేలం నవంబర్ 27న న్యూఢిల్లీలో జరగనుంది. ఈ మెగా వేలం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ వేలంలో మొత్తం ఆరు జట్లు 277 మంది ఆటగాళ్ల కోసం బిడ్ వేయనున్నాయి. ఈ ఆటగాళ్లలో 194 మంది దేశీయ, 66 మంది విదేశీ ఆటగాళ్ళు ఉన్నారు. ఐదు జట్లు గతంలో తమ 16 మంది ఆటగాళ్లను నిలుపుకున్నాయి.
WPL 2026 వేలం ఎప్పుడు జరుగుతుంది?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 వేలం నవంబర్ 27, గురువారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి న్యూఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో జరుగుతుంది.
WPL 2026 వేలాన్ని ప్రత్యక్షంగా ఎక్కడ చూడాలి?
WPL 2026 వేలం JioHotstar, మొబైల్ అప్లికేషన్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ ఈవెంట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈవెంట్ కవరేజ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. వేలం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఏ జట్టు దగ్గర ఎంత డబ్బు ఉంది?
యూపీ వారియర్స్ – రూ. 14.5 కోట్లు
గుజరాత్ జెయింట్స్ – రూ. 9 కోట్లు
ఆర్‌సీబీ – రూ. 6.15 కోట్లు
ముంబై ఇండియన్స్ – రూ. 5.75 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 5.7 కోట్లు
WPL 2026 వేలం నియమాలు..
ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా 18 మంది ఆటగాళ్లను రంగంలోకి దించవచ్చు. ప్రతి జట్టుకు కనీసం 15 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. ఐదు జట్లలో మొత్తం 73 ఖాళీలు ఉన్నాయి. వాటిలో 23 విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు.
మొదటిసారిగా, జట్లు తమ 2025 జట్టు నుంచి ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేయడానికి గరిష్టంగా ఐదు రైట్ టు మ్యాచ్ ( RTM) కార్డులను ఉపయోగించుకోవచ్చు.
తక్కువ మంది ఆటగాళ్లను నిలుపుకున్న ఫ్రాంచైజీలకు వేలంలో ఎక్కువ RTM, పర్స్ వాల్యూ ఉంటుంది.
వేలానికి ముందు నిలుపుకున్న ఆటగాళ్లు..
ముంబై ఇండియన్స్: నాట్ స్కైవర్-బ్రంట్ ( రూ. 3.5 కోట్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ ( రూ. 2.5 కోట్లు), హేలీ మాథ్యూస్ ( రూ. 1.75 కోట్లు), అమన్‌జోత్ కౌర్ ( రూ. 1 కోటి), జి. కమలిని ( రూ. 50 లక్షలు).
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన ( రూ. 3.5 కోట్లు), రిచా ఘోష్ ( రూ. 2.75 కోట్లు), ఎల్లీస్ పెర్రీ ( రూ. 2 కోట్లు), శ్రేయంకా పాటిల్ ( రూ. 60 లక్షలు).
గుజరాత్ జెయింట్స్: ఆష్లీ గార్డనర్ ( రూ. 3.5 కోట్లు), బెత్ మూనీ ( రూ. 2.5 కోట్లు).
యూపీ వారియర్స్: శ్వేతా సెహ్రావత్ ( రూ. 50 లక్షలు).
ఢిల్లీ క్యాపిటల్స్: జెమిమా రోడ్రిగ్స్ ( రూ. 2.2 కోట్లు), షఫాలీ వర్మ ( రూ. 2.2 కోట్లు), అన్నాబెల్ సదర్లాండ్ ( రూ. 2.2 కోట్లు), మారిజాన్ కాప్ (రూ. 2.2 కోట్లు), నికి ప్రసాద్ ( రూ. 50 లక్షలు).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




