AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20I World Cup 2026: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడే జట్లు ఇవే.. సూర్యకుమార్ షాకింగ్ స్టేట్‌మెంట్

Surya Kumar Yadav: ఆతిథ్య భారత్, శ్రీలంకతో పాటు, టోర్నమెంట్‌లో పాల్గొనే 18 జట్లు ఆఫ్ఘనిస్తాన్ , ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఓమన్, యూఏఈ జట్లు ఉన్నాయి.

T20I World Cup 2026: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడే జట్లు ఇవే.. సూర్యకుమార్ షాకింగ్ స్టేట్‌మెంట్
Suryakumar Yadav
Venkata Chari
|

Updated on: Nov 26, 2025 | 9:53 PM

Share

Surya Kumar Yadav: రాబోయే టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2026లో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాను ఫైనల్లో ఓడించాలని ఉందని తన మనసులోని మాట బయటపెట్టాడు.

పాత పగ తీర్చుకోవాలని..

ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్, “ఫైనల్లో ఏ జట్టుతో తలపడాలని అనుకుంటున్నారు?” అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించాలనుందని తెలిపాడు.

2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇదే అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఆ ఓటమికి ప్రతీకారంగానే సూర్యకుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. ఆనాడు చేజారిన కప్పును, అదే వేదికపై, అదే ప్రత్యర్థిని ఓడించి సాధించాలన్న కసిని ఆయన మాటలు ప్రతిబింబిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

టీ20 వరల్డ్ కప్ 2026 విశేషాలు..

తేదీలు: ఈ టోర్నమెంట్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.

వేదికలు: భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మ్యాచ్‌లు అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, కొలంబోలోని ప్రేమదాస స్టేడియం, సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, కాండీలలో జరుగుతాయి.

మొత్తం 20 జట్లు..

ఆతిథ్య భారత్, శ్రీలంకతో పాటు, టోర్నమెంట్‌లో పాల్గొనే 18 జట్లు ఆఫ్ఘనిస్తాన్ , ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఓమన్, యూఏఈ జట్లు ఉన్నాయి.

టీమిండియా షెడ్యూల్:

ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.

ఫిబ్రవరి 12న నమీబియాతో తలపడుతుంది.

ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారీ సమరం జరగనుంది.

ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడుతుంది.

ఈసారి సొంతగడ్డపై జరుగుతుండటం, గత టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండటంతో టీమిండియాపై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు టైటిల్ నిలబెట్టుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

46 ఫ్రీ స్కూల్స్, 26 అనాథాశ్రమాలు కట్టించిన రియల్ హీరో
46 ఫ్రీ స్కూల్స్, 26 అనాథాశ్రమాలు కట్టించిన రియల్ హీరో
ఈ-వ్యర్థాల నుండి బంగారం! శాస్త్రవేత్తల సరికొత్త టెక్నాలజీ.. చౌకగా
ఈ-వ్యర్థాల నుండి బంగారం! శాస్త్రవేత్తల సరికొత్త టెక్నాలజీ.. చౌకగా
ఈ యూపీఐ యాప్ ద్వారా సెకన్లలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా
ఈ యూపీఐ యాప్ ద్వారా సెకన్లలోనే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
మీ వంటింట్లో ఉండే ఈ చిన్న గింజల వెనుక.. ఇంత పెద్ద ఆరోగ్య రహస్యాలు
మీ వంటింట్లో ఉండే ఈ చిన్న గింజల వెనుక.. ఇంత పెద్ద ఆరోగ్య రహస్యాలు
పండక్కి ఊరెళ్లవారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్గాల్లో వెళ్తే..
పండక్కి ఊరెళ్లవారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్గాల్లో వెళ్తే..
కందిపప్పు వీరికి విషంతో సమానం.. తిన్నారంటే ఈ సమస్యలు పక్కా..
కందిపప్పు వీరికి విషంతో సమానం.. తిన్నారంటే ఈ సమస్యలు పక్కా..
24క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం కేవలం 181 రూపాయలకే! ఎక్కడో తెలిస్తే
24క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం కేవలం 181 రూపాయలకే! ఎక్కడో తెలిస్తే
తెలంగాణ నిరుద్యోగులకు రిలీఫ్.. జాబ్ క్యాలెండర్ విడుదలపై అప్డేట్
తెలంగాణ నిరుద్యోగులకు రిలీఫ్.. జాబ్ క్యాలెండర్ విడుదలపై అప్డేట్
ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు..
ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు..