WPL 2024: స్మృతి మంధాన ఈసారైనా? యూపీ వారియర్స్, ఆర్సీబీ మ్యాచ్ నేడు.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లు తలపడనున్నాయి. తొలి ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర చాలా పేలవంగా ఆడింది. స్మృతి మందన్నా నేతృత్వంలోని RCB

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ రెండో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లు తలపడనున్నాయి. తొలి ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర చాలా పేలవంగా ఆడింది. స్మృతి మందన్నా నేతృత్వంలోని RCB ఆడిన 8 మ్యాచ్‌లలో 2 మాత్రమే గెలిచింది. ఓవరాల్ గా జట్టు పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో నిలిచింది. యూపీ వారియర్స్ కూడా గత ఎడిషన్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ ఓడిపోవడంతో ఆ జట్టు ఫైనల్ చేరాలన్న కల చెదిరిపోయింది. దీంతో ఇరు జట్లూ విజయంతో రెండో సీజన్ ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. గత ఎడిషన్‌లో ఇరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించాయి. తద్వారా నేటి మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు చూడొచ్చు.
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ, యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ఛానెల్‌లలో వీక్షించవచ్చు. అలాగే, Jio సినిమా యాప్‌లో మొబైల్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.
అందరి చూపు స్మృతి మంధన్నా పైనే..
B̷r̷o̷t̷h̷e̷r̷s̷ 𝗦𝗶𝘀𝘁𝗲𝗿𝘀 𝗼𝗳 𝗱𝗲𝘀𝘁𝗿𝘂𝗰𝘁𝗶𝗼𝗻 🤜🤛🔥#PlayBold #SheIsBold #ನಮ್ಮRCB #WPL2024 @sophdevine77 @mandhana_smriti pic.twitter.com/aUpeMC7zrR
— Royal Challengers Bangalore (@RCBTweets) February 24, 2024
రెండు జట్లు (అంచనా)
RCB:
స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లిస్ పెర్రీ, కనికా అహుజా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), నాడిన్ డి క్లర్క్, రాంకా పాటిల్, మేగన్ షుట్, రేణుకా సింగ్ ఠాకూర్, ప్రీతి బోస్, ఆశా శోభన.
Bollywood’s King and RCB’s Queen 👑#PlayBold #SheIsBold #ನಮ್ಮRCB #WPL2024 @mandhana_smriti @iamsrk pic.twitter.com/cjch3MUyTW
— Royal Challengers Bangalore (@RCBTweets) February 23, 2024
యూపీ వారియర్స్:
అలిస్సా హీలీ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), వృందా దినేష్, శ్వేతా షెరావత్, కిరణ్ నవగిరే, చమరి అటపట్టు, తహ్లియా మెగ్రత్, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, సైమా ఠాకోర్, పార్శ్వి చోప్రా.
3⃣..2⃣..1⃣ and GO 🔥🔥
It’s ACTION Time in Bengaluru 🙌#TATAWPL Season 2 begins! pic.twitter.com/CmqnhDvk4G
— Women’s Premier League (WPL) (@wplt20) February 23, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








