Womens World Cup 2022: విజయం దిశగా టీమిండియా.. కీలక మ్యాచులో మంధాన స్పెషల్ రికార్డ్.. అదేంటంటే?
టార్గెట్ ఛేందించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీం 25 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.
మహిళల ప్రపంచ కప్(Womens World Cup 2022) 22వ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ముందు భారత్(INDW vs BANW) 230 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టార్గెట్ ఛేందించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీం 23 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. క్రీజులో సల్మా ఖాతూన్, లతా మండల్ ఉన్నారు. లక్ష్యం కూడా స్వల్పమే అయినా.. బంగ్లాదేశ్(India Women vs Bangladesh Women) ఇన్నింగ్స్ పేలవంగా మొదలుపెట్టింది. ఆరో ఓవర్‌లో, షర్మిన్ అక్తర్ 5 పరుగుల వద్ద రాజేశ్వరి గైక్వాడ్ చేతిలో చిక్కి పెవిలయన్ చేరింది. షర్మిన్ క్యాచ్‌ని ఫస్ట్ స్లిప్‌లో స్నేహ్ రాణా పట్టుకుంది. అనంతరం ఫర్గానా హోక్ (0)కి పూజా వస్త్రాకర్ ఎల్‌బీడబ్ల్యూ చేసి, భారత్‌కు రెండో వికెట్‌ను అందించింది. రివ్యూలో టీమిండియాకు ఈ వికెట్ దక్కింది. వాస్తవానికి, అంపైర్ ఫర్గానాకు నాటౌట్ ఇచ్చాడు. ఆ తర్వాత భారత కెప్టెన్ మిథాలీ రాజ్ DRS డిమాండ్ చేసింది. రీప్లేలో బంతి లెగ్ స్టంప్‌కు తగిలిందని తేలింది. స్కోరు 28 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ పడిపోయింది. కెప్టెన్ నిగర్ సుల్తానా 11 బంతుల్లో 3 పరుగుల వద్ద స్నేహ రానా పెవిలియన్ చేర్చింది. ఈ క్యాచ్‌ను మిడ్ ఆన్ వద్ద హర్మన్‌ప్రీత్ కౌర్ క్యాచ్ పట్టింది.
ఓపెనర్ ముర్షిదా ఖాతూన్ 54 బంతుల్లో 19 పరుగులు చేసి పూనమ్ యాదవ్ చేతిలో ఔట్ అయింది. ముర్షిదా ఇచ్చిన క్యాచ్ కూడా హర్మన్ చేతికి చిక్కింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే స్నేహ రాణా.. రుమానా అహ్మద్ (2)ను అవుట్ చేసి భారత్‌కు 5వ వికెట్‌ను అందించింది. రుమానా క్యాచ్‌ను షార్ట్ లెగ్ వద్ద యాస్తిక భాటియా క్యాచ్ పట్టింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. యస్తికా భాటియా (50) టాప్ స్కోరర్‌గా నిలవగా, షెఫాలీ వర్మ 42 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌లో రీతూ మోని 3 వికెట్లు పడగొట్టింది. నహిదా అక్తర్ ఖాతాలో 2 వికెట్లు చేరాయి.
భారత స్టార్ ఓపెనర్ మంధాన ఈ మ్యాచ్‌లో 17 పరుగులు చేసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో తన 5,000 పరుగులను పూర్తి చేసింది. 5,000 పరుగులు పూర్తి చేసిన తర్వాత, స్మృతి తన ఇన్నింగ్స్‌ను పెద్దగా పొడిగించలేకపోయింది. 51 బంతుల్లో 30 పరుగుల వద్ద నహిదా అక్తర్ చేతిలో ఔటైంది. మంధాన క్యాచ్‌ని స్క్వేర్ లెగ్ వద్ద ఫెర్గానా హోక్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరింది.
కాగా, మంధాన (5013) అంతర్జాతీయ క్రికెట్‌లో 5,000 పరుగులు చేసిన మూడో భారత మహిళా క్రీడాకారిణిగా మారింది. ఈ లిస్టులో మొదటి స్థానంలో టీమిండియా సారథి మిథాలీ రాజ్ నిలవగా, రెండవ స్థానంలో హర్మన్‌ప్రీత్ కౌర్ ఉంది. స్మృతి మంధాన (30) బంగ్లాదేశ్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసింది.
రెండు జట్లు-
భారత్ : స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ (కీపర్), స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్.
బంగ్లాదేశ్: షర్మిన్ అక్తర్, ముర్షిదా ఖాతూన్, ఫర్గానా హోక్, నిగర్ సుల్తానా (కెప్టెన్), రుమానా అహ్మద్, రీతు మోని, లతా మండల్, సల్మా ఖాతూన్, నహిదా అక్తర్, ఫాహిమా ఖాతూన్, జహనారా ఆలం.